E-Paper
Advertisement

Boora Criticism: ఎన్నికల ముందు బట్లర్.. పవర్ రాగానే హిట్లర్.. రేవంత్ రెడ్డి పరిపాలనపై బూర సంచలన వ్యాఖ్యలు!

Boora Criticism: ఎన్నికల ముందు బట్లర్.. పవర్ రాగానే హిట్లర్.. రేవంత్ రెడ్డి పరిపాలనపై బూర సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Boora Criticism: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్‌కు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసే దమ్ములేదని, కానీ మైక్ దొరికితే మాత్రం బీజేపీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తిట్టాలి. ఆ తర్వాత హామీలు ఎగ్గొట్టాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్టీ కలెక్షన్లలో..

సీఎం రేవంత్‌ను ఊహించుకునే ఆడలేక మద్దెల దరువు అనే సామెత కనిపెట్టినట్టు ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బట్లర్ లా ఉండి.. పవర్ లోకి గానే హిట్లర్ గా మారారని విమర్శించారు. ప్రపంచంలో అతి కిరాతకమైన వ్యక్తి హిట్లర్ అని బూర మండిపడ్డారు. 8 కోట్ల మందిని బలి తీసుకున్న వ్యక్తి హిట్లర్ అని పేర్కొన్నారు. సొంత దేశంలో దివ్యాంగులు ఉండొద్దని బాయిలర్లలో వేసి చంపిన వ్యక్తి హిట్లర్ అని వివరించారు. తెలంగాణ జీఎస్టీ కలెక్షన్ల లో 7 నుంచి 9వ స్థానానికి పడిపోయిందన్నారు. రేవంత్ ఫ్యూచరిస్టిక్ పరిపాలనతో 9వ ర్యాంక్ కు పడిపోయిందన్నారు. మెట్రో, ఆర్ఆర్ఆర్ కి కిషన్ రెడ్డి నిధులు తెస్తే రేవంత్.. మూసీ నదిలో గడ్డి పీకడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు.

Advertisement

Also Read: రేవంత్ చ‌ర్చ స‌వాల్‌కు కిష‌న్‌రెడ్డి సై! ఎవ‌రేం చేశారో తేల్చుకుందాం రా! బీఆరెస్ ప్రేక్ష‌క‌పాత్ర‌!

తెలియకపోతే ఎలా..?

దేశ ద్రోహి రాహుల్ గాంధీ గులాంగా రేవంత్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం అయినా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోలేదని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవాచేశారు. ఈస్ట్ పార్ట్ నుంచి రాష్ట్రపతి, వెస్ట్ పార్ట్ నుంచి ప్రధాని, సౌత్ నుంచి ఉప రాష్ట్రపతి ఉన్నారని, ఇది కూడా రేవంత్ కు తెలియకపోతే ఎలా? అని ప్రశ్నించారు. 12 ఏళ్లలో మోడీ ఎంత అభివృద్ధి చేశారో అనే చర్చకు తాను సిద్ధమని, రేవంత్ మొత్తం మంత్రి వర్గానికి తాను ఒక్కడినే చాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్తే మోడీ కాళ్లు పట్టుకుని గల్లీకొచ్చి తిడతావా? అని విమర్శించారు. తొందర్లోనే ప్రజలు కాంగ్రెస్ కు పిండం పెట్టడం ఖాయమని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.

Advertisement

Also read: బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×