Peddi Re-Edit Buzz: ‘పెద్ది’… చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రంగస్థలం, RRR వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత మరోసారి రామ్ చరణ్ నటనకు, బాడీ లాంగ్వేజ్‌కు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే కమర్షియల్‌గా సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, కంటెంట్ మరియు స్క్రీన్‌ప్లే విషయంలో వస్తున్న విమర్శలను చిత్ర యూనిట్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే సాధారణ ప్రేక్షకులు, సినిమా విమర్శకుల నుంచి డివైడ్ టాక్ రావడంతో, దర్శకుడు బుచ్చిబాబు సానా ఇపుడు సినిమాని మళ్ళీ ఎడిట్ చేసే పనిలో పడ్డాడట.
మాములుగా ఒక పెద్ద సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి మార్పులు చేయడం చాలా రేర్ అని చెప్పాలి.కానీ ‘పెద్ది’ టీమ్ మాత్రం ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని గ్లామరస్ సీన్స్, కొన్ని అభ్యంతకరమైన షాట్స్ సోషల్ మీడియాలో గట్టి నెగెటివిటీని మూట గట్టుకుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను చూపించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, దర్శకుడు బుచ్చిబాబు సానా ఏమాత్రం మొహమాటపడకుండా ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ ఆ కాంట్రవర్సీ సీన్స్ ని సినిమా నుండి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ వెర్షనే స్క్రీన్ అవుతుంది కూడా.
అయితే తాజా ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నటాక్ ప్రకారం ‘పెద్ది’ సినిమాలో ఎడిటింగ్ మార్పులు అంతటితో ఆగడం లేదు. ముఖ్యంగా సెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉండటం, కథనం స్లో అయిందంటూ థియేటర్ల నుంచి గట్టి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి మేకర్స్ కేర్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
also read :38 ఏళ్లకే గుండెపోటుతో పాపులర్ సింగర్ మృతి.. షాక్‌లో సోషల్ మీడియా!
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని లెంతీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ట్రిమ్ చేసి, వాటి స్థానంలో చరణ్ మరియు జగపతి బాబు పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ సీన్స్ కలపాలని భావిస్తున్నారు. జగపతి బాబు, చరణ్ మధ్య వచ్చే ఈ కొత్త సీన్లు సినిమా స్థాయిని పెంచుతాయని నమ్ముతున్నారు మేకర్స్.
సినిమాలోని లాగ్స్ అన్నింటినీ కత్తిరించి, స్క్రీన్ ప్లే మరింత స్పీడ్ గా మార్చేందుకు ఎడిటింగ్ రూమ్‌లో గంటల తరబడి వర్క్ జరుగుతోంది. ఉప్పెన సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న బుచ్చిబాబు, ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామాను ప్రేక్షకులకు మరింత గ్రిప్పింగ్‌గా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన కొత్త ఎడిటెడ్ వెర్షన్‌ను మళ్లీ సెన్సార్ బోర్డు ముందుకు తీసుకెళ్లనున్నారు. రీ-సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసి, వచ్చే వీకెండ్‌లోగా అంటే జూన్ 12 లోపే ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.చూడాలి మరి ఈ సరికొత్త మార్పులు సినిమాకు ఏ మేరకు కలిసివస్తాయో!
also read :షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!