GT VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న క్వాలిఫై రెండవ మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) తలపడ్డాయి. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Suryavanshi) గాయపరిచే కుట్ర జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) ఆదేశాల మేరకు.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, జాసన్ హోల్డర్ ముగ్గురు… బౌన్సర్లతో ఈ బుడ్డోడిని వణికించారు. మొన్న హైదరాబాద్ పైన భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్. దాన్ని తలుచుకొని భయపడిపోయిన గుజరాత్.. బౌన్సర్లతో వైభవ్ ను గాయపరిచే కుట్ర చేసింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన నుంచి వైభవ్ సూర్యవంశీ ఔట్ అయ్యే వరకు షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బంది పెట్టారు. అక్కడితో ఆగకుండా భయంకరమైన బౌన్సర్లు సంధించారు. చాలా సార్లు వైభవ్ సూర్య వంశీ హెల్మెట్ కు బంతులు తగిలాయి. ఇక మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతి, అగ్ని పిడుగు లాగా వచ్చి వైభవ్ సూర్యవంశీ హెల్మెట్ కు తగిలింది. దీంతో వైభవ్ సూర్య వంశీ విలవిలలాడిపోయాడు. ఆ తర్వాత బిల్డప్ కోసం వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వచ్చి.. మహమ్మద్ సిరాజ్ యాక్టింగ్ చేశాడు. అరె బుడ్డోడా.. దెబ్బ తగిలిందా? అంటూ స్మూత్ గా డీల్ చేశాడు మహ్మద్ సిరాజ్.
అయితే ఇదంతా కుట్రలో భాగంగా జరిగినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. కోచ్ ఆశిష్ నెహ్రా ఆదేశాల మేరకు వైభవ్ సూర్యవంశీ తలకు మాత్రమే బంతులు వేశారని అంటున్నారు. అందుకే హైదరాబాద్ పైన ఆడినంత స్పీడుగా.. నిన్న గుజరాత్ పైన వైభవ్ ఆడలేక పోయాడు. కానీ 96 పరుగులు మాత్రమే అయితే సాధించాడు. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన ఇలాంటి కుట్రలు తగదని.. గుజరాత్ టైటాన్స్ భయపడిపోయి ఇలా బౌలింగ్ చేసిందని దారుణంగా క్రికెట్ అభిమానులు ఆడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ప్లే ఆఫ్స్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండుసార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు. 90 పరుగులు దాటిన తర్వాత సిక్సర్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్ చేతిలో ఎలా అవుట్ అయ్యాడో, అచ్చం అలాగే నిన్న కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఏదో ట్రైన్ మిస్ అవుతుందన్నట్లుగా అన్నట్లుగ ఆగమాగం చేసి, సెంచరీలు మిస్ చేసుకున్నాడు.
Gujarat Titans looked terrified of Vaibhav Suryavanshi tonight.
Instead of backing their bowling and challenging him with proper deliveries, they kept targeting his body and avoided giving him anything playable.
Vaibhav had to duck, sway and defend ball after ball at least 20… pic.twitter.com/0XluUqFwhc
— Woke Eminent (@WokePandemic) May 29, 2026