Hanuma Vihari: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా చిత్తుగా ఓడిపోయిన హైదరాబాద్, ఇంటి దారి పట్టింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ 2027 టోర్నమెంట్ పై ఫోకస్ చేసింది. ఇప్పటినుంచి చెత్తగా ఆడిన ప్లేయర్లను ఏరివేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు కీలక సూచనలు చేశారు టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు కుర్రాడు హనుమ విహారి. కేవలం ముగ్గురు ప్లేయర్లను తొలగిస్తే హైదరాబాద్ అద్భుతంగా రాణిస్తుందని సూచనలు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Indian Premier League 2027 Tournament) నేపథ్యంలో ట్రావిస్ హెడ్ ను ( Travis Head) ముందుగా జట్టులోంచి తొలగించాలని హనుమ విహారి సూచనలు చేశారు. అప్పుడే హైదరాబాద్ బాగుపడుతుందని వివరించారు. హెడ్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యాడని.. అతన్ని తీసుకున్న కూడా దండగా అని పేర్కొన్నారు. అతన్ని తొలగిస్తే 14 కోట్ల వరకు హైదరాబాదుకు ఆదా వెల్లడించారు. అలాగే హర్షల్ పటేల్ ను ( Harshal Patel) కూడా రిలీజ్ చేయాలని కోరాడు. జయదేవ్ ఉనద్కత్ ను కూడా రిలీజ్ చేస్తే మంచిదని తెలిపారు. ఈ ముగ్గురిని మొదటగా రిలీజ్ చేసిన తర్వాత… మరికొంతమందిపై ఫోకస్ చేయాలన్నారు. షాకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హెంగే ( Praful Hinge) ఇద్దరు కూడా హైదరాబాదుకు ( SRH Team) మంచి బౌలర్లుగా ఉన్నారని వివరించారు. వాళ్లని బాగా వాడుకోవాలని కావ్య పాపకు సూచనలు చేశారు. ఇక హెడ్ స్థానంలో ఓ మంచి హిట్టర్ ను తీసుకుంటే బెటర్ అన్నారు. దీంతో హనుమ విహారి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2027 నేపథ్యంలో హైదరాబాద్ కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేయనుంది. స్మరణ్ రవిచంద్రన్, శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్, హనుమ విహారి చెప్పినట్లుగా హర్షల్ పటేల్, హెడ్, జయదేవ్ లాంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ పైన ( Liam Livingston) కూడా వేటుపడనుంది. డేవిడ్ పైన్ ను కూడా వదిలేయనుంది కావ్య పాప ( Kavya Maran). ఇలా చెత్త ప్లేయర్ లందరిని వదిలేస్తే హైదరాబాద్ జట్టుకు 40 కోట్లు ఆదా కానున్నాయి. వీళ్ల స్థానంలో మంచి ఆటగాలను కొనుగోలు చేస్తే, SRH ను ఆపడం ఎవరి తరం కాదు అంటున్నారు ఫ్యాన్స్.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==