E-Paper

ప్ర‌తి ఒక్క‌డూ సంజును అనేవాడే…వైభ‌వ్ కు అంత‌సీన్ లేదు!

ప్ర‌తి ఒక్క‌డూ సంజును అనేవాడే…వైభ‌వ్ కు అంత‌సీన్ లేదు!
Advertisement

Hanuma Vihari:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్ తో అరంగేట్రం చేయని వైభవ్… ఇంగ్లాండుతో అయినా ఆడించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని… సంజు శాంసన్ స్థానంలో… వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ రెండో టి20 జరగనుండగా… వైభవ్ కు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

ప్ర‌తి ఒక్క‌డూ సంజును అనేవాడే…వైభ‌వ్ కు అంత‌సీన్ లేదు!

Advertisement

వైభ‌వ్ సూర్య‌వంశీని తీసుకోవ‌డంపై తాజాగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కోసం.. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను జీరో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో వైభవ్ సూర్యవంశీ అవసరం టీమిండియాకు లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తీసుకువచ్చిన సంజు శాంసన్ కు ఇప్పుడు గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని.. కేవలం 15 ఏళ్ల కుర్రాడి కోసం అతన్ని అవమానించకూడదని కోరారు. వైభవ్ మరో ఐదు సంవత్సరాలైనా టీమిండియాలో స్థానం కోసం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆవేశపడి వైభవ్ కు అవకాశం ఇస్తే.. టీమిండియా కొంప మునుగుతుందని హెచ్చరించారు హనుమ విహారి (Hanuma Vihari).

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో బాగా ఆడాడని వైభవ్ సూర్య వంశీకి టీమిండియాలో అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ తుది జట్టులో అతడు స్థానం సంపాదించాలంటే కాస్త సమయం పడుతుందని వెల్లడించారు హనుమ విహారి. ఎన్ని సంవత్సరాలైనా టీమిండియా కోసం వెయిట్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. టి20 వరల్డ్ కప్ సమయంలో సంజు ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడని, అందుకే ఇప్పుడు అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో సంజు శాంసన్ బాగా ఆడి ఉండకపోతే.. టీమిండియా పరువు పోయేదన్నారు. అప్పుడు టీమిండియాను ఆదుకున్నాడు కాబట్టి… వరల్డ్ కప్ హీరో స్థాయిలో సంజు శాంసన్ కు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాంటి సంజు శాంసన్ ను కించపరిచేలా చాలామంది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకటి రెండు ఇన్నింగ్స్ లలో విఫలమైతే, తీసేస్తారా ? అంటూ నిలదీశారు.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

 

 

Related News

Joshua Tromp: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

Nasser Hussain: వైభవ్ బ్యాట్ లో స్ప్రింగులు దాచాడు…వెంట‌నే చెక్ చేయండి

Axar Patel: వీళ్ల‌కు బ్యాటింగే చేత‌కాదు, ఇంగ్లీష్ క్లాసులు అవ‌స‌ర‌మా?

వివాదంలో సంజు…ప్రాక్టీస్ స‌మ‌యంలో వైభ‌వ్ మెడ‌లు ప‌ట్టుకుని బెదిరింపులు ?

Kavya Maran: కావ్య బ‌రిలోకి దిగితే, శ‌త్రువు కూడా కాళ్ల ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

Big Stories

×