E-Paper
Advertisement

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!
Advertisement

Hyundai Creta Electric BaaS Explained: హ్యుందాయ్ మోటార్ ఇండియా పాపులర్ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ కోసం కొత్త బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌ తో ఎలక్ట్రిక్ SUVని మరింత చౌక ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది వినియోగదారులకు క్రెటా ఎలక్ట్రిక్ మరింత అందుబాటులోకి రానుంది.  కొత్త BaaS స్కీమ్ కింద బ్యాటరీ ధరను వెహికల్ ధరలో చేర్చకుండా ప్రత్యేక సబ్‌ స్క్రిప్షన్ విధానంలో అందిస్తున్నారు. దీని వల్ల కారు కొనుగోలు సమయంలో భారీ తగ్గింపు ధరను పొందే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్ చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఏకంగా రూ. 7.04 లక్షల తగ్గింపు

ఈ స్కీమ్ ప్రకారం 42kWh బ్యాటరీతో వచ్చే క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. బ్యాటరీ యూసేజ్ కోసం ప్రతి కిలోమీటర్‌కు రూ.3.90 చెల్లించాలి. ఇదే వేరియంట్‌ ను బ్యాటరీతో కలిసి సాధారణంగా కొనుగోలు చేయాలంటే రూ.18.03 లక్షలు ఖర్చవుతుంది. అంటే.. కొత్త BaaS ప్లాన్ ద్వారా ప్రారంభ ధరలో సుమారు రూ.7.04 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో బ్యాటరీ అద్దె విధానాన్ని అందిస్తున్న కంపెనీల జాబితాలో హ్యుందాయ్ కూడా చేరింది. ఇప్పటికే MG విండ్సర్ EV, MG ZS EV, మారుతి ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ EV లాంటి మోడళ్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇప్పుడు క్రెటా ఎలక్ట్రిక్ కూడా అదే రూట్ లోకి వచ్చింది.

డిజైన్ గురించి..

Advertisement

క్రెటా ఎలక్ట్రిక్‌ కు ప్రత్యేకమైన EV స్టైలింగ్‌ను అందించారు. ముందు భాగంలో ఫుల్ విడ్త్ LED DRLs, LED హెడ్‌ ల్యాంప్స్, బ్లాంక్ ఆఫ్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరింత స్పెషల్ లుక్ ను అందిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌ లో 17 అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ క్లాడింగ్, టర్న్ ఇండికేటర్లతో కూడిన ORVMలు ఉన్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌ ల్యాంప్‌లు, రూఫ్ స్పాయిలర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రీమియం లుక్‌ ను ఇస్తాయి.

ఇంటీరియర్ గురించి..

ఇంటీరియర్‌ లో హ్యుందాయ్ అత్యాధునిక ఫీచర్లను అందించింది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత పరంగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,  టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు డిస్క్ బ్రేకులు, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బ్యాటరీ ఆప్షన్స్..

క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఎంపికల్లో లభిస్తుంది. 42kWh బ్యాటరీతో ఫుల్ ఛార్జ్ చేస్తే 420 కిలోమీటర్ల వరకు, 51.4kWh బ్యాటరీతో గరిష్టంగా 510 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 100kW DC ఫాస్ట్ ఛార్జర్ తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×