Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. హార్దిక్ పాండ్యా పుట్టినరోజు కావడంతో తనకు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక హార్దిక్ పాండ్యా తన పుట్టిన రోజున తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ముంబై ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందంటూ అనేక రకాల వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుని లవ్ ఎమోజిని జత చేశాడు. వీరిద్దరూ తొందరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా లవర్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఈ అమ్మాయి పేరు మహికా శర్మ ఈమె ప్రముఖ మోడల్. షార్ట్ ఫిలిమ్స్ లలోను నటించింది. మ్యూజిక్ వీడియోలలో కలిసి పనిచేసింది.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన కొత్త ప్రియురాలి హాట్ టాపిక్ గా మారుతున్న వేళ తనకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారుతుంది. హార్థిక్ పాండ్యా గత కొంతకాలం నుంచి తాను ఎఫైర్ నడిపించిన అమ్మాయిల పేర్లు తెరపైకి వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా తన కెరీర్ ప్రారంభంలో లిశా శర్మ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొంత కాలం పాటు వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడిచింది. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం హార్దిక్ పాండ్యా ఎల్లి అవ్రమ్ అనే అమ్మాయితో రిలేషన్ నడిపించాడు. వీరిద్దరి మధ్య కొంతకాలం పాటు రిలేషన్ నడిచింది వీరు కూడా విడిపోయారు.
ఆ తర్వాత హార్దిక్ ఈషా గుప్తా అనే అమ్మాయితో ఎఫైర్ నడిపించాడు. వీరిద్దరి మధ్య కొంతకాలం పాటు నడిపించిన ప్రేమాయణం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా సినీ నటి ఊర్వశి రౌతేలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారట ఆ తర్వాత ఏమైందో తెలియదు బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం హార్దిక్ పాండ్యా పరిణీతి చోప్రాతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పీకల్లోకి ప్రేమలో మునిగి తేలినట్లుగా అనేక రకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించాడు వీరిద్దరూ కొంత కాలం పాటు ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు.
వీరికి అతి తక్కువ సమయంలోనే ఓ కుమారుడు కూడా జన్మించాడు. తన వయసు ఐదు సంవత్సరాలు. వివాహం జరిగిన కొద్ది రోజులకే వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. విడాకుల అనంతరం వారి కుమారుడి బాధ్యతలను మాత్రం ఇద్దరూ తీసుకుంటామని వెల్లడించారు. విడాకుల తర్వాత కూడా హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నట్టుగా కొన్ని రకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అనంతరం హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజున కొత్త గర్ల్ ఫ్రెండ్ ను తన అభిమానులకు పరిచయం చేస్తూ ఫోటోలను షేర్ చేసుకున్నాడు. వీరిద్దరూ త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నట్లుగా కొన్ని రకాల వార్తలు టాపిక్ గా మారుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.