BigTV English

IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!

IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!

IND-W vs SA-W: వన్డే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా మహిళల జట్టు, బలమైన సౌతాఫ్రికా ను మాత్రం ఎదుర్కోలేకపోయింది. నిన్న జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది టీమిండియా మహిళల జట్టు. వాస్తవానికి ఈ మ్యాచ్ సులభంగా గెలిచేది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) నిర్ణయాలు, టాపార్డ‌ర్‌, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్లింగ్ జరుగుతుంది.


Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు

రీల్స్ పైన ఉన్న శ్రద్ధ బ్యాటింగ్ పైన లేదంటూ ట్రోలింగ్

టీమిండియా మహిళల జట్టు ముందు ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా ఉంది. ఇండియాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా అయినా వెళ్లాలి. లేకపోతే టీమిండియా పరువు మొత్తం పోతుంది. ఇలాంటి కీలకమైన సిరీస్ లో టీమిండియా టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తో పాటు లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana) లాంటి స్టార్ ప్లేయర్లు కూడా రాణించడం లేదు. నిన్న రిచా ఘోష్‌ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటేనా? టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయేది. స్నేహ రాణా కూడా అద్భుతంగా రాణించి, జట్టుకు మంచి పరుగులు అందించారు. కానీ టీమిండియా బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఇక అటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) , హర్లీన్ డియోల్ ఇద్దరు కూడా బ్యాటింగ్ లో విఫలమయ్యారు. హ‌ర్మ‌న్ కెప్టెన్సీ నిర్ణ‌యాలు కూడా టీమిండియా కొంప ముంచాయి. ఆమె అన‌వ‌స‌రంగా బౌలింగ్ చేసింద‌ని అంటున్నారు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడానికి తప్ప, క్రికెట్ కు మాత్రం పనికిరారని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.


లేడీ కోహ్లీ ( Smriti Mandhana) కూడా నట్టేట ముంచుతోంది

లేడీ కోహ్లీ గా పేరుగాంచిన స్మృతి మందాన మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరుస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు అద్భుతంగా ఆడిన మందాన, ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో మొత్తం 54 పరుగులు మాత్రమే చేసి విఫలమైంది. శ్రీలంక పైన 8 పరుగులు చేయగా పాకిస్తాన్ పై 23 పరుగులకు అవుట్ అయింది. నిన్న సౌత్ ఆఫ్రికా పై 23 పరుగులకే వెనుదిరిగింది. కోహ్లీ లాగా టీం ఇండియాను ఆదుకుంటుంది అనుకుంటే అట్టర్ ప్లాప్ అవుతోంది స్మృతి మందాన.

Also Read: IND-W vs SA-W: కొంప‌ముంచిన‌ హర్మన్.. ద‌క్షిణాఫ్రికా విక్ట‌రీ..పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా సేఫ్‌

 

 

Related News

Hardik Pandya GirlFriend: మ‌రో కొత్త పిల్ల‌ను ప‌డేసిన హార్దిక్ పాండ్యా..ఆ ఇద్ద‌రిని వ‌దిలేసి మ‌రీ !

IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలానికి ముహుర్తం ఫిక్స్‌.. స‌గం ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేస్తున్న CSK

Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

Thaman: 40 బంతుల్లో 108 ప‌రుగులు..త‌మ‌న్ విధ్వంసం.. ఉప్ప‌ల్ లో కొడితే, తుప్ప‌ల్లో ప‌డింది

Ind vs WI, 2nd Test: టాస్ గెలిచిన టీమిండియా..బ్యాటింగ్ ఎవ‌రిదంటే, జ‌ట్ల వివ‌రాలు ఇవే

Richa Ghosh-Pant: రిష‌బ్‌ పంత్ లాగా రిచా ఘోష్ డ్రామాలు, కానీ ప్లాన్ బెడికొట్టింది

NZ-W vs Ban-W: నేడు బంగ్లాదేశ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌…పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Big Stories

×