Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ సీజన్ 9 ట్విస్ట్ ల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. ఎవరు ఊహించని విధంగా శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిపోవడం అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్. ఫ్లోరా సైని ఎలిమినేట్ అయిపోతుంది అని అందరూ ఊహించారు. అది మామూలే, కానీ నిన్నటి ఎపిసోడ్ లో చాలా స్ట్రాంగ్ అని ఎవరినైతే నాగార్జున పొగిడారో ఆవిడ ఈరోజు బయటికి వెళ్లిపోయారు.
దువ్వాడ మాధురి శ్రీనివాస్ కోసం ఏమైనా వదులుకుంటా అని చెప్పింది. మరి బిగ్ బాస్ కోసం ఆయన్ని ఎందుకు వదిలేశారు అని నాగార్జున అడిగారు. ఆయన చెప్పారు అని వచ్చాను సార్ అని క్లారిటీ ఇచ్చింది మాధురి. హౌస్ లో ఇంకా ఎవరూ బయటపడలేదు అందరూ రంగులు త్వరలో బయటపడతాయి. ఇమ్మానియేల్ నాకు బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పింది.
నాది చాలా ముక్కుసూటి తత్వం. అందుకే నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నా ఇంటర్మీడియట్ లో నాన్న మ్యారేజ్ చేసేసారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లే ప్రపంచం. నాకు మా ఆయనకి మధ్య అర్థం చేసుకోవడం అనేది చాలా తక్కువ. కొన్ని కారణాల వలన ఇద్దరం విడిపోయాం. కుటుంబ పరంగా సమస్యలు ఎదురై ఒంటరిగా మిగిలినప్పుడు, అదే కుటుంబ సమస్యలతో శ్రీనివాస్ గారు బాధపడుతున్నప్పుడు మా మధ్య పరిచయం జరిగింది.
శ్రీనివాస్ అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అనే విధంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి బతుకుతున్నాం అని క్లారిటీ ఇచ్చింది. నేను నరకం చూడని రోజు లేదు, ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగాన మీద కామెంట్స్ పెడుతున్నారు. ఆ వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లను అని చూడకుండా పిల్లల్ని ట్రోల్ చేశారు. అంటూ బాధ పడింది. జీవితం అనేది సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. దువ్వాడ మాధురి అంటే ఏంటో బిగ్ బాస్ హౌస్ లో చూపిస్తా.
దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలామంది హౌస్ మెట్ షాక్ అయ్యారు. తనని చూడగానే దువ్వాడ మాధురి అంటూ ఒకరు, బాబోయ్ అంటూ మరొకరు షాక్ అయ్యారు. అయితే అందరూ మాధురి అని అంటున్న తరుణంలో నా పేరు అందరికీ తెలుసు ఒక్క శ్రీజ కి తప్ప అని అంది మాధురి.
వెంటనే శ్రీజ నాకు నిజంగానే మీ పేరు తెలియదండి మాధవినో మాధురినో అంటూ అనడం మొదలుపెట్టింది. ప్రెస్ మీట్స్ అందరూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు మీ పేరు విషయంలో అని ఉంది. ఎవరికీ కన్ఫ్యూజన్ లేదు నీ ఒక్కదానికి మాత్రమే కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పింది. ఏంటి రాగానే గొడవపడాలని చూస్తున్నావా అని దువ్వాడ మాధురి వెంటనే శ్రీజను అడిగేసింది. అయితే సుమన్ శెట్టి కి శ్రీజ కి మధ్య జరిగిన టాస్క్ లో శ్రీజ దమ్ము బెలూన్ కట్ చేసి ఎలిమినేట్ అవ్వడంలో కూడా ఒక చేయి వేసింది దువ్వాడ మాదిరి.
Also Read: Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్