Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ సీజన్ 9 లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ కు ఎంట్రీ ఇచ్చారు. 5వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు ఆయేషా. అయేషా స్టేజ్ మీదకి రాగానే గలగల మాట్లాడటం మొదలు పెట్టేసింది. నేను చాలా యాక్టివ్ సార్ అని చెప్పింది. నైస్ ఎనర్జీ అని నాగ్ అన్నారు. లోపల ఎనర్జీ లేదు కదా సార్ అందుకే అంటూ సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంది.
ఆయేషా ఇంతకుముందు తమిళ్ బిగ్ బాస్ షోలో 65 రోజులు ఉన్నాను. నాకు అప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అయితే అప్పుడు అతని ఏం చేస్తున్నాడు అనే ధ్యాసలో ఉండిపోయి నా ఆటలన్నీ సరిగ్గా ఆడేదాన్ని కాదు. 65 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు అర్థమైంది వాడు ఇంకొక అమ్మాయితో వెళ్లిపోయాడు అని.
అందుకే అక్కడ మిస్ చేశాను కాబట్టి ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది. కాబట్టి అస్సలు తగ్గేదేలే అంటూ గలగల మాట్లాడింది. దేవుడికి కృతజ్ఞత కలిగి పాపం దీని తప్పు వలన కాదులే అనుకుని రెండవ అవకాశం తెలుగు బిగ్ బాస్ లో ఇచ్చాడు. ఇది నేను గెలవాలి 60 రోజులే కదా, ఇక్కడ గెలుస్తాను అని చెప్పింది.
అయితే ప్రతి కంటెస్టెంట్ కి లోపలికి వెళ్తున్నప్పుడు ఒక పవర్ ఇస్తున్నారు. ఈవిడ ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ లో ఉంది కాబట్టి విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చి మొదటి నాగార్జునకు విష్ చేశారు. ఆ తర్వాత ఆయేషా ఎంట్రీ ఇస్తున్నందుకు తనకి అభినందనలు తెలిపారు. పవర్ ఆఫ్ నామినేషన్ అనే స్పెషల్ పవర్ నీకు ఇస్తున్నాను అని చెప్పారు.
తను బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది కాబట్టి ఒక టాస్క్ పెట్టారు నాగర్జున. ఎక్కువగా హార్ట్ ఎందుకు బ్రేక్ అవుతుంది అని అడిగారు. మూడు రీజన్స్ చెప్పాలి అని చెప్పినప్పుడు. మనం మొదట ఎవరినైతే బలంగా ఇష్టపడతామో వాళ్ళ వలన హార్ట్ బ్రేకింగ్ జరుగుతుంది. బాగా ఇష్టమైన వ్యక్తి మన నుంచి కోల్పోతున్నప్పుడు దానిని తట్టుకోలేము దాని వలన హార్ట్ బ్రేక్ జరుగుతుంది.
రెండు చెప్పిన తర్వాత ముఖ్యంగా ఈ సీజన్ కప్పు కొట్టకపోతే మాత్రం నాకు హార్ట్ బ్రేక్ జరుగుతుంది అని తన సెన్సాఫ్ హ్యూమర్ బయటికి తీసింది ఆయేషా. ఒక కంప్లీట్ హార్ట్ సింబల్ కూడా తనకు ఇచ్చారు. హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ లో ఒకరికి ఈ కంప్లీట్ హార్ట్ ఇచ్చి ఎందుకు ఇచ్చావో కారణం కూడా చెప్పాలి అని అడిగారు.
హౌస్ లోకి కంప్లీట్ లవ్ సింబల్ తీసుకుని వెళ్లి మొత్తానికి ఆ లవ్ సింబల్ ను ఇమ్మానుయేల్ కి ఇచ్చింది. ఇమ్మానియేల్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ నాకోసం ఒక అందమైన అమ్మాయిని పంపించావా అంటూ కామెడీ చేయడం మొదలు పెట్టాడు.
Also Read: Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. హౌస్ మేట్స్ షాక్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు