BigTV English

H. Pandya Wishes to Ritika Sajdeh: MI హోలీ సంబరాలు.. రోహిత్ శర్మ భార్యకు.. హగ్ ఇచ్చి మరీ విషెస్ చెప్పిన పాండ్యా!

H. Pandya Wishes to Ritika Sajdeh: MI హోలీ సంబరాలు.. రోహిత్ శర్మ భార్యకు.. హగ్ ఇచ్చి మరీ విషెస్ చెప్పిన పాండ్యా!

Hardik Pandya


Hardik Pandya Holi Wished to Rohit Sharma’s Wife Ritika Sajdeh: ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంత ప్రయత్నించినా రోహిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ నుంచి బయటపడలేక పోతున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత తీవ్రంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఈ సమయంలో హార్దిక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఇందులో రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ కు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు హోలీ వేడుకలో రితిక వద్దకు వెళ్లిన హార్దిక్ ఆమెకు ఒక సోదరునిగా హగ్ ఇచ్చి, హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. దీని తర్వాత కూతురు సమైరాతో కూడా ముచ్చట్లు పెట్టాడు. అయితే ఒక చెల్లెలిగా భావించి తను చెప్పిన గ్రీటింగ్స్ ని కూడా అభిమానులు వదలడం లేదు.


నిజానికి హార్దిక్ ను ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ జట్టులోకి తిరిగి తీసుకురావాలని సంప్రదించింది. తనప్పటికే గుజరాత్ కెప్టెన్ గా ఉన్నాడు. మళ్లీ ముంబై జట్టులోకి ఆటగాడిలా ఎందుకు రావాలి? అని గాలిలో ఒక బాణం విసిరాడు. కెప్టెన్సీ ఇస్తే వస్తానని అన్నాడు.

అప్పటికి టీ 20 ప్రపంచకప్ కి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పేరు దాదాపు ఫిక్స్ అయిపోయింది. మరోవైపు వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెరీర్ డిఫెన్స్ లో పడిపోయింది.

Also Read: Rohit Sharma Back As Captain: మళ్లీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ?

అప్పుడు ముంబై ఇండియన్స్ సరైన ప్రణాళిక లేకుండా అత్యుత్సాహంతో హార్దిక్ వస్తానన్నాడనే అత్యుత్సాహంతో రోహిత్ శర్మకు కనీస మర్యాద ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఇక్కడే నిప్పు రాజుకుంది.
ఏ ఆటగాడైనా ఐపీఎల్ ఆడేది డబ్బుల కోసమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ హార్దిక్ ని తప్పు పట్టడానికి లేదు.

కెప్టెన్సీ మార్పుపై రోహిత్ భార్య రితికా కూడా తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ జరిగింది. అయితే హార్దిక్ పాండ్యా తీవ్రంగా ట్రోలింగ్ బారిన పడ్డాడు. దాంతో పాండ్యా అభిమానుల కోపం చల్లార్చడానికి తన ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ క్రమంలోనే హోలి పండుగ సందర్భంగా రితికాకు శుభాకాంక్షలు తెలిపాడు.

మేమంతా ఒకటేననే సందేశాన్ని ఇచ్చాడు. కానీ అభిమానులెవరూ లెక్క చేయడం లేదు. వారి దారిలో వాళ్లు వెళ్లిపోతున్నారు. అయితే వీటన్నింటికి అడ్డు కట్ట వేయాలంటే ఒకటే మార్గం ఉంది. అదేమిటంటే…
రోహిత్ శర్మ, భార్య రితికా ఇద్దరూ కలిసి అభిమానులను శాంతింపచేయాలి. అప్పుడే ముంబై జట్టుకి మనశ్శాంతిగా ఉంటుంది.

Also Read: CSK vs GT: నిలిచేదెవరు? గెలిచేదెవరు?.. నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

మరోవైపు హోలీ వేడుకలో రోహిత్ శర్మ తన కుటుంబంతో సరదాగా గడిపాడు. రితికా, కుమార్తె సమైరాతో కలిసి హోలీ ఆడుతున్న వీడియోలు నెట్టంట బాగా వైరల్ అయ్యాయి. అయితే యువ క్రికెటర్ తిలక్ వర్మ కూడా రోహిత్ కూతురుతో కలిసి హోలీని ఎంజాయ్ చేశాడు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×