BigTV English

Rohit Sharma Back As Captain: మళ్లీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ..? ఫ్యాన్స్ లో పునకాలు!

Rohit Sharma Back As Captain: మళ్లీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ..? ఫ్యాన్స్ లో పునకాలు!
Rohit Sharma to Return as Captain in IPL 2024
Rohit Sharma return As Captain in IPL 2024: ఒకరితో అంటే పోరాడగలరు..ఇద్దరితో అంటే పోరాడగలరు. కానీ వ్యవస్థతో పోరాడాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు రోహిత్ శర్మ వెనుక ఆ వ్యవస్థ ఉంది. కొండంత అభిమానులు ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కావచ్చు. వేల కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు…అంతకన్నా విలువైన, అన్నిటికన్నా ఖరీదైన అభిమాన గణం రోహిత్ శర్మ వెనుక ఉంది. ఇప్పుడు దానిని ఎదిరించి నిలబడే శక్తి ముంబై ఇండియన్స్ కి లేనట్టే కనిపిస్తోంది.

అందుకనే తిరిగి రోహిత్ శర్మకి కెప్టెన్సీ అప్పగించేందుకు ముంబై ప్రాంచైజీ బోర్డు మీటింగులు పెడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నెట్టింట రోజూ ఇదే పెంట జరగడం, ఊరికినే హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం సర్వసాధారణమైపోయింది. దీంతో పాండ్యా తన సహజసిద్ధమైన ఆటను కోల్పోయాడంటే అతని కెరీర్ కి ప్రమాదమే. అలాగే భారత జట్టుకి, భారత క్రికెట్ కి కూడా ప్రమాదమేనని చెప్పాలి.


ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌‌ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ మార్పు జరిగిన దగ్గర నుంచి ఇదే పాట పాడుతున్నారు. అంతేకాదు ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య కూడా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. కొందరు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా అంగీకరించ లేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇక తొలి మ్యాచ్‌లో రోహిత్ పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహారించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.అభిమానుల నిరసనలు కూడా ఎక్కువ కావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం దీనిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


Also Read: ఓడిన వారి మధ్య ఫైట్.. నేడు హైదరాబాద్ ముంబై మధ్య పోరు

రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాల మధ్య వివాదానికి తెర దించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇద్దరి ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టుగా సమాచారం. అంతేకాదు రోహిత్ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా నియమించాలనే నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడే మార్చితే లేనిపోని సంకేతాలు వెళతాయి కాబట్టి, సీజన్ మధ్యలో రెండో దశ ప్రారంభమయ్యే సమయంలో మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×