Big Stories

Ultraviolette F77 in Turkey: ఇది కదా ఇండియా అంటే.. ఖండాంతరాలు దాటిన ఆల్ట్రావయొలెట్ బైక్!

Ultraviolette F77
Ultraviolette F77

Ultraviolette F77 Bike is Set to Sell in Turkey: గత ఐదేళ్లలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ముఖ్యంగా మానుఫ్యాక్చరింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దేశంలో తయారైన అనేక వస్తువులు విదేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్ వస్తువులకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే తాజాగా ఈ లిస్టులో ఓ బైక్ తయారీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయొలెట్ నిలిచింది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా బైకులను తయారు చేస్తుంది. కంపెనీ ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 బైక్‌ను గతంలో లాంచ్ చేసింది. కాగా ఇప్పుడు ఈ బైకులను టర్కీ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలు చూసేయండి.

- Advertisement -

ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 చూడటానికి మంచి డిజైన్, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. కంపెనీ ఇటీవలే
ఇస్తాంబుల్ 2024 ఎగ్జిబిషన్‌లో బైక్ లవర్స్‌కు పరిచయం చేసింది. త్వరలోనే టర్కీ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. మోటార్‌సైకిల్ డిస్టిబ్యూటర్ కే-రైడ్స్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇది టర్కీ టూ వీలర్ కంపెనీ. ఇది కిబార్ హోల్డింగ్‌లో భాగం.

- Advertisement -

టర్కీ బైక్ ఎగ్జిబిషన్‌లో కంపెనీ తన ఎఫ్77 టాప్ స్పెక్ మోడల్ రీకాన్‌ను ప్రదర్శంచింది. ఈ మోడల్‌లో
0.3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జ్‌తో ఏకంగా 307 కిమీ వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 152 కిమీగా ఉంది. ఈ వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా EV.. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలో మీటర్లు!

ఈ ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 ఫీచర్స్ చూస్తే.. ఇందులో ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. బైక్‌లో TFT డాష్‌ను కూడా చూడవచ్చు. డిజైన్ కూడా చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ టర్కీలో మంచి సక్సెస్ సాధిస్తోందని సంస్థ భావిస్తుంది. దేశీయ మార్కెట్‌లో ఈ ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 3.80 లక్షలుగా ఉంది. ఇందులో మరో వేరియంట్ రీకం ధర రూ. 4.55 లక్షలు. ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో ఉన్న 300 సీసీ, 400 సీసీ వేరియంట్లలో కేటీఎం 390 డ్యూక్, కవాసకి నింజా 500 వంటి వాటికి కాంపిటీటివ్‌గా ఉంది. కంపెనీ ఇటీవలే సూపర్‌నోవా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను బైక్‌లో డెవలప్ చేసింది.

టర్కీలో ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 డిమాండును దృష్టిలో ఉంచుకుని విక్రయించడం జరుగుతుంది. అంతే కాకుండా మోటోబైక్ ఇస్తాంబుల్ 2024లో ఎగ్జిబిషన్ ద్వారా 190 కంటే ఎక్కువ దేశాలు ఈ బైక్ కోసం ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఈ బైకును మరిన్ని దేశాల్లో విక్రయించే అవకాశం ఉంది. అయితే టర్కీ తరువాత కంపెనీ ఏ దేశంలో విక్రయించనుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు.

Also Read: కొత్త డిజైన్, ఫీచర్లతో మారుతి స్విఫ్ట్, డిజైర్..!

ఆల్ట్రావయొలెట్ బెంగళూరులో తన ఎఫ్77 ఎలక్ట్రిక్ మోడల్ బైక్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసినప్పటి నుంచి
బైక్ ప్రేముకుల మనసు కొళ్లగొట్టింది. దీని అద్భుతమైన డిజైన్, ఫీచర్స్‌తో ఈ బైక్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఎక్కువ రేంజ్‌ని ఇస్తుంది. అందువల్ల ఎక్కువ మంది ఈ బైక్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News