BigTV English

IPL 2024 CSK Vs GT: నిలిచేదెవరు..? గెలిచేదెవరు..? నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

IPL 2024 CSK Vs GT: నిలిచేదెవరు..? గెలిచేదెవరు..? నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

CSK vs GT


IPL 2024 Chennai Super Kings Vs Gujarat Titans: ఐపీఎల్ మ్యాచ్ లు పోటాపోటీగా సాగుతున్నాయి. నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు చెరో విజయంతో ముందడుగు వేశాయి.

ప్రారంభం రోజున ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. ఇప్పుడు ఇద్దరు తొలి మ్యాచ్ ల విజేతల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.


ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేలో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్లు ఉండగా, గత రెండు సీజన్లుగా నిరంతరం ఫైనల్స్‌ ఆడుతున్న గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు మ్యాచ్ విన్నర్లుగా ఉన్నారు.

ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 5 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ 3 గెలవగా, సీఎస్కే 2 గెలిచాయి. వీటిలో ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. గుజరాత్ కొత్తగా ఐపీఎల్ కి రావడం వల్ల వీరిమధ్య తక్కువ మ్యాచ్ లు జరిగాయి.

Also Read: Virat Kohli: జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. : విరాట్ భావోద్వేగం..

2023లో ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించి చెన్నై టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. అప్పుడు కప్ గెలిచినా ధోనీ ఇప్పుడు కెప్టెన్ గా లేడు. అలాగే ఫైనల్ వరకు గుజరాత్ ను తీసుకువెళ్లిన హార్దిక్ గుజరాత్ టైటాన్స్ లో లేడు. అంటే 2023లో ఆడిన ఇద్దరు కెప్టెన్లు లేరు. ప్రస్తుతం కొత్తగా సీఎస్కే లో గైక్వాడ్ కెప్టెన్ గా ఉంటే, గుజరాత్ కి శుభ్ మన్ గిల్ ఉన్నాడు.

ఈ సీజన్ లో చిదంబరం స్టేడియంలో చెన్నై ఆల్రడీ తొలి మ్యాచ్ ఆడింది. గుజరాత్ మాత్రం తొలి మ్యాచ్ ఆడనుంది. మరి రెండు వీర జట్ల మధ్య మ్యాచ్ ఓ వీర లెవెల్లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా, రషీద్ ఖాన్, సందీప్ వారియర్, బీఆర్ శరత్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఉమేష్ యాదవ్, అభినవ్ మనోహర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆర్. సాయి కిషోర్, దర్శన్ నల్కండే, జోష్ లిటిల్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సింధు, ప్రశాంత్ సింధు తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవ్నీష్ రావ్ ఆరావళి.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×