E-Paper
Advertisement

IND VS SA: మ్యాచ్ ర‌ద్దు కావ‌డంపై శశిథరూర్ సీరియ‌స్‌.. సౌత్‌లో మ్యాచ్‌లు పెట్టండి

IND VS SA:  మ్యాచ్ ర‌ద్దు కావ‌డంపై శశిథరూర్ సీరియ‌స్‌.. సౌత్‌లో మ్యాచ్‌లు పెట్టండి
Advertisement

IND VS SA: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య బుధవారం రోజు లక్నో వేదికగా జరగాల్సిన నాలుగవ టి-20 మ్యాచ్ దట్టమైన పొగ మంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. దట్టమైన పొగ మంచు కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు నిర్ణయించారు. సాయంత్రం 6:30 గంటలకు టాస్ నిర్వహించాల్సి ఉండగా.. పొగ మంచు కారణంగా 9:30 గంటల వరకు పరిశీలించి చివరికి మ్యాచ్ ని రద్దు చేశారు.

Also Read: Smriti Mandhana: ల‌వ‌ర్ టెన్ష‌న్ లేదు.. స్మృతి మందాన బ‌రితెగింపు ? పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని !

Advertisement

సాయంత్రం నుండి 6:50, 7:30, 8:00, 8:30, 9:00, 9:20 గంటల సమయంలో అంపైర్లు పలుమార్లు పిచ్ పరిశీలనలు నిర్వహించినా.. పరిస్థితులలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. దీంతో చివరిసారి రాత్రి 9:25 గంటలకు పిచ్ పరిశీలన చేసిన అనంతరం మ్యాచ్ ని అధికారికంగా రద్దు చేశారు. దీంతో కాలుష్యంపై తీవ్ర విమర్శలు చేశారు అభిమానులు. ఆటగాళ్ల ఆరోగ్యం పై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తీవ్ర అసంతృప్తి:

Advertisement

దట్టమైన పొగ మంచు కారణంగా మ్యాచ్ ని రద్దు చేసిన పరిణామంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశంలోని నగరాలలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని, ఈ నాలుగవ టి-20 మ్యాచ్ ని కేరళలో నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా శశిథరూర్ స్పందిస్తూ.. ” లక్నోలో ఏ.క్యూ.ఐ 411 కి చేరింది. ఇంత తక్కువ విజిబిలిటీతో క్రికెట్ ఆడటం అసాధ్యం. తిరువనంతపురంలో అయితే ప్రస్తుతం ఏ.క్యూ.ఐ సుమారు 68 మాత్రమే ఉంది. మ్యాచ్ ని అక్కడ షెడ్యూల్ చేసి ఉంటే అభిమానులు ఈ స్థాయిలో నిరాశ చెందాల్సిన అవసరం ఉండేది కాదు” అని పోస్ట్ చేశారు. ఇక మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేశారు.

 

డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో చివరి మ్యాచ్:

భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగవ టి-20 పొగ మంచు కారణంగా రద్దు కావడంతో.. ఇరుజట్ల మధ్య చివరి టి-20 మ్యాచ్ డిసెంబర్ 19 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సొంతం చేసుకోవాలని సూర్య టీం భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ ని సమం చేయాలన్నది సౌత్ఆఫ్రికా టీం లక్ష్యం. కానీ ఈ మ్యాచ్ తుది జట్టులో కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తుంది.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

ఈ మ్యాచ్ కి ఇద్దరు సీనియర్లు దూరం కానున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కి గిల్, అక్షర్ పటేల్ దూరం అవుతున్నారు. గిల్ స్థానంలో జట్టులోకి సంజు శాంసన్, అక్షర్ పటేల్ స్థానంలో బెంగాల్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ ని జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ లాగే షాబాజ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఇతడు గతంలో టీమిండియా తరపున 3 వన్డేలు, రెండు టి-20 మ్యాచ్ లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్లలో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. 2023 ఆసియా క్రీడల తర్వాత ఇతడు మళ్లీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

 

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×