E-Paper
Advertisement

Smriti Mandhana: పలాష్ ముచ్చల్ కు మరో షాక్ ఇచ్చిన స్మృతి.. సోషల్ మీడియా పై సంచలన నిర్ణయం!

Smriti Mandhana: పలాష్ ముచ్చల్ కు మరో షాక్ ఇచ్చిన స్మృతి.. సోషల్ మీడియా పై సంచలన నిర్ణయం!
Advertisement

Smriti Mandhana: సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్, భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్ళి వేడుకలలో పాల్గొంటున్న సమయంలో స్మృతి మందాన తండ్రి గుండెపోటు లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే ఆయనను సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

Advertisement

అయితే ఇలాంటి పరిస్థితులలో పెళ్లిని వాయిదా వేసుకోవడమే మంచిది అని భావించిన స్మృతి మందాన.. పెళ్లి కొడుకు తరపున వారు చెప్పినప్పటికీ.. ఆమె తన తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ వల్ల పలాశ్ ఇబ్బంది పడ్డాడని వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స అనంతరం పలాశ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 

వివాహం వాయిదాకి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో రూమర్స్:

Advertisement

స్మృతి – పలాశ్ వివాహం వాయిదా పడడానికి అసలు కారణం ఇదే అంటూ ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. స్మృతి.. తన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. తనకి కాబోయే భర్త పలాశ్ మోసం చేయడమే దీనికి కారణమని పలు ఆరోపణలు వైరల్ గా మారాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో పలాశ్ కి, మరో మహిళకి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అనంతరం ఇవి రెడ్డీట్ లో వైరల్ అయ్యాయి. వీటిలో సదరు మహీలను పలాశ్ స్విమ్మింగ్ కి ఆహ్వానించాడు. స్మృతితో తనకు ఉన్న బంధం పాతబడిపోయిందని, తనతో డేటి**గ్ చేయాలని ఆ మహిళను పలాశ్ కోరినట్లు ఆ స్క్రీన్ షాట్లలో ఉంది. అంతేకాకుండా స్మృతి గురించి కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

 

సోషల్ మీడియాలో పలాశ్ ని అన్ ఫాలో చేసిన స్మృతి:

అయితే ఈ స్క్రీన్ షాట్ లు వైరల్ గా మారడం మాత్రమే కాకుండా.. పలాశ్ తో పెళ్లికి ముందు జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలను స్మృతి మందాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా తాజాగా instagram లో అతడిని స్మృతి అన్ ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

అయితే ఇది పూర్తిగా అవస్థవం అని తేలింది. పలాశ్ ని ఆమె ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీనివాస్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే స్మృతి – పలాశ్ పెళ్లికి సంబంధించిన అప్డేట్ మాత్రం కుటుంబ సభ్యుల నుంచి రాలేదు. కానీ వీరి పెళ్లికి సంబంధించిన మరొక డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×