E-Paper
Advertisement

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ,  ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో
Advertisement

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు- కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు గాయాలు అయ్యారు. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కారు, బస్సులోని వారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అసలు ఎలా జరిగింది?

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు-కారు బలంగా ఢీ కొన్నాయి. వేగంగా వచ్చిన కారు, బస్సును బలంగా ఢీ కొట్టింది. బస్సు ముందు పార్టు డ్రైవర్ వద్ద డ్యామేజ్ అయ్యింది. ఇక కారు ముందు భాగం బాగానే నుజ్జు అయ్యింది.

ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత వారిని సురక్షితంగా వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు అధికారులు. ఘటన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సేఫ్

ఘటన గురించి తెలియగానే చేవెళ్ల పోలీసులు అక్కడికి చేరుకుని, ఆర్టీసీ డ్రైవర్-కారుకి చెందిన వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం చూసినవాళ్లు ఎయిర్‌ బ్యాగ్స్ వల్ల కారులోని వ్యక్తులు సేఫ్‌గా ఉన్నారని, లేకుంటే ఊహించిన ఘోరం జరిగేదని అంటున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట కేంద్రం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని నిబంధన తెచ్చింది.

ALSO READ: కోదాడలో ఘోర రోడ్డు.. లారీ-ట్రావెల్ బస్సు ఢీ, నుజ్జైన బస్సు ముందుభాగం

అన్నిరకాల సెగ్మెంట్ కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని తయారీ సంస్థలకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే. కార్లను మధ్య తరగతి ఫ్యామిలీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కాపాడుతాయి. అందుకు ఎగ్జాంఫుల్ చేవేళ్లలో ఆదివారం జరిగిన కారు ప్రమాదమే.  ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో చాలావరకు కార్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×