E-Paper
Advertisement

రఘువంశీ వివాద‌స్ప‌ద ర‌నౌట్…గొడ‌వ‌కు దిగిన KKR…అస‌లు ఇది ఔటా ? నాటౌటా ? రూల్స్ ఇవే

రఘువంశీ వివాద‌స్ప‌ద ర‌నౌట్…గొడ‌వ‌కు దిగిన KKR…అస‌లు ఇది ఔటా ? నాటౌటా ? రూల్స్ ఇవే
Advertisement

Raghuvanshi Run Out:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు అన్ని వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. వివాదాస్పద క్యాచ్ లతో పాటు, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా కేకేఆర్ ఆటగాడు రఘువంశీ రనౌట్ ( Raghuvanshi Run Out) కూడా వివాదంగా మారింది. అబ్ స్ట్ర‌క్టింగ్ ద ఫీల్డ్ ( obstructing the field dismissal) రూల్ ప్రకారం అతన్ని రనౌట్ గా అంపైర్లు ప్రకటించారు. దీంతో కేకేఆర్ యాజమాన్యం గొడవకు దిగింది. ముఖ్యంగా కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్… ఫోర్త్ ఎంపైర్ తో వాగ్వాదానికి కూడా దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్ర‌మంలో రఘువంశీ రనౌట్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

అబ్ స్ట్ర‌క్టింగ్ ద ఫీల్డ్ రూల్ ప్రకారం రఘువంశీ రనౌట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ కేకేఆర్ వర్సెస్ లక్నో ( Lucknow Super Giants vs Kolkata Knight Riders) మధ్య 38వ మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్ పేయ్ ఏక్ నా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వికెట్లు పడుతున్న బాధలో ఉన్న కేకేఆర్ కు అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం, ఊహించని దెబ్బకొట్టింది. లక్నోతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ రఘువంశి ఔట్ అయిన‌ తీరు వివాదంగా మారింది. అతడు రన్ తీసేందుకు సగం గ్రీజు దాటి, మళ్లీ వెనక్కి వెళ్ళాడు. ఈ క్రమంలో డైవ్ చేసిన రఘువంశీ… ఫీల్డర్ వేసిన బంతికి అడ్డు తగిలాడు. ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్ అప్పీల్ చేశాడు. దీంతో అబ్ స్ట్ర‌క్టింగ్ ద ఫీల్డ్ ( obstructing the field dismissal) రూల్ ప్రకారం ర‌ఘువంశీని రనౌట్ గా అంపైర్లు ప్రకటించారు. అయితే అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయం పైన రఘువంశీ చాలా సీరియస్ అయి.. బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. ఉద్దేశపూర్వకంగా అడ్డుకోనప్పుడు ఔట్ ఎలా ఇస్తారని కేకేఆర్ కూడా గొడవకు దిగింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నిజంగానే రఘువంశీ త‌ప్పుచేశాడా ?

కేకేఆర్ ఆటగాడు రఘువంశీ రనౌట్ పైన సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. అతను నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వాస్తవంగా రఘువంశీ రైట్ సైడ్ పిచ్ పై పరుగు కోసం వెళ్లాలి. మొదట బౌలర్ ఎండ్ వైపు వచ్చేటప్పుడు సరిగ్గానే పరిగెత్తిన రఘువంశీ, రనౌట్ అవుతానన్న భయంతో లెఫ్ట్ సైడ్ పిచ్ వైపు వెళ్ళాడు. ఫీల్డర్ వికెట్లను కొడతాడన్న భయంతో పరిగెత్తాడు రఘువంశీ. ఈ క్రమంలోనే బంతి రఘువంశీకి తగిలింది. దీనిని కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. రిప్లైలో అన్ని ప‌రిశీలించిన అంపైర్లు, అబ్ స్ట్ర‌క్టింగ్ ద ఫీల్డ్ ( ఫీల్డ‌ర్ కు ఆటంకం క‌లిగించ‌డం) రూల్ ప్రకారం రఘువంశీని ఔట్ అంటూ ప్ర‌క‌టించేశారు.

Advertisement

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

 

 

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×