Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament ) వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో 300 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపుతున్నాడు. ఇక నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపైన సెంచరీ కూడా నమోదు చేశాడు వైభవ్. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో వైభవ్ సూర్య వంశీ లాంటి మొనగాడే లేడని వ్యాఖ్యానించారు. మరో వంద సంవత్సరాలు అయినా కూడా వైభవ్ లాంటి ప్లేయర్ పాకిస్తాన్ లో పుట్టబోడని బాంబు పేల్చారు. దీంతో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. బుమ్రాన్ నుంచి మొదలుకొని, ప్యాట్ కమిన్స్ వరకు అందరినీ చితకబాదాడు వైభవ్. ఈ తరుణంలో ముత్తయ్య మురళీధరన్ లాంటి బౌలర్లు కూడా భయపడిపోతున్నారు. రిటైర్మెంట్ ఇచ్చి బతికి పోయాను… లేకపోతే వైభవ్ తన బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేవాడని బాంబు పేల్చాడు. ఇలా మాజీ క్రికెటర్లందరూ వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ ఉంటే.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విషం కక్కుతున్నారు.
అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం రూట్ మార్చి భిన్నంగా స్పందించాడు. ప్రపంచంలోనే అత్యున్నత బ్యాటర్ గా వైభవ్ సూర్య వంశీ ఎదుగుతున్నాడని ప్రశంసించారు. ఇలాంటి ఆటగాన్ని తాను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో ఏ ఒక్క ఆటగాడు కూడా వైభవ్ సూర్య వంశీకి సరిపోడని.. బాంబు పేల్చారు. ఈ 15 ఏళ్ల వయసులోనే ఇంత భయంకరంగా ఆడుతున్నాడు అంటే.. ఇది మామూలు విషయం కాదని వైభవ్ సూర్య వంశీని మెచ్చుకున్నారు షోయబ్ అక్తర్.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మెచ్చుకుంటూ ఉంటే, ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో అదరగొడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాట్లను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. అతడు వాడే బ్యాట్ లలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందని.. అందువల్లే అవలీలగా సిక్సర్లు అలాగే బౌండరీలు కొడుతున్నాడని ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంజమామ్ ఉల్ హక్.
https://www.facebook.com/photo?fbid=987889907485085&set=a.808612632079481