E-Paper
Advertisement

U-19 World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో హైద‌రాబాద్ కుర్రాడు.. అరోన్ జార్జ్ ఆరా..!

U-19 World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో హైద‌రాబాద్ కుర్రాడు.. అరోన్ జార్జ్ ఆరా..!

U-19 World Cup : అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కి భార‌త జ‌ట్టును శ‌నివారం రాత్రి బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన ఈ జ‌ట్టుకు ఆయూశ్ మాత్రే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. విహాన్ మ‌ల్హొత్రా వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. జ‌న‌వ‌రి 15 నుంచి ఫిబ్ర‌వ‌రి 06 వ‌ర‌కు జింబాబ్వే, న‌మీబియా వేదిక‌గా ఈ టోర్నీ జ‌రుగ‌నుంది. ఈ మెగా ఈవెంట్ కి ముందు భార‌త యువ జ‌ట్టు సౌతాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. అయితే ఈ సిరీస్ కు రెగ్యుల‌ర్ కెప్టెన్ మాత్రే, మ‌ల్హొత్రా గాయాల కార‌ణంగా దూర‌మ‌య్యాడు. దీంతో మాత్రే స్థానంలో యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నాడు.

Also Read : DC Vs MIE : పొలార్డ్ విధ్వంసం.. ఒకే ఓవ‌ర్ లో 6, 4, 2, 6, 6, 6

వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో హైద‌రాబాద్ కుర్రాడు

అయితే ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో హైద‌రాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ కి చోటు ద‌క్కింది. ఆసియా క‌ప్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులోనూ సెలక్ట‌ర్లు కొన‌సాగించారు. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో సూర్య‌వంశీకి డిప్యూటీ గా జార్జ్ వ్య‌వ‌హ‌రించాడు. దీంతో జార్జ్ గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్లు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. 19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేర‌ళ అయిన‌ప్ప‌టికీ.. జూనియ‌ర్ స్థాయి క్రికెట్ లో హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. జార్జ్ కు అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డ‌ర్ ఆట‌గాడికి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆడే స‌త్తా ఉంది. ముఖ్యంగా జ‌ట్టు క‌ష్టాల్లో ఉందంటే అంద‌రి చూపు జార్జి పైనే ఉంటుంది. అంత‌లా క్రికెట్ ఆడుతుంటాడు.

సంజూ శాంస‌న్ స్టైల్ లో..

ముఖ్యంగా అత‌ని బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ స్టైల్ కి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అలాగే అత‌నికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉంటాయి. దాదాపు 38 ఏళ్ల త‌రువాత కెప్టెన్ గా హైద‌రాబాద్ కు విను మాన్క‌డ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజ‌య్ మ‌ర్చంట్ ట్రోఫీ లో బీహార్ పై ట్రిపుల్ సెంచ‌రీ సాధించి తొలిసారిగా అంద‌రి దృష్టిని జార్జ్ ఆక‌ర్షించాడు. గ‌త రెండు సీజ‌న్ల‌లో క‌లిపి 700 కి పైగా ప‌రుగులు చేసి హైద‌రాబాద్ జ‌ట్టుకు కీల‌క ఆట‌గాడిగా మారాడు.అంతేకాదు.. గ‌త నెల‌లో బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ లో జ‌రిగిన అండ‌ర్ 19 ట్రై సిరీస్ లో ఇండియా బీ జ‌ట్టుకు కెప్టెన్ గా అత‌ను వ్య‌వ‌హ‌రించాడు. ఆసియా క‌ప్ 2025లోనూ పాకిస్తాన్ పై 85 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2026వేలంలో మాత్రం అమ్ముడు పోలేదు జార్జ్. రూ.30ల‌క్ష‌ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వ‌చ్చినా అత‌డినీ ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిచూపించ‌లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా గాయ‌ప‌డితే జార్జ్ ను ప్ర‌త్యామ్న‌యంగా తీసుకునే అవ‌కాశం అయితే ఉంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున దుమ్ములేపుతున్న మాత్రే కూడా అలా వ‌చ్చిన వాడే కావ‌డం విశేషం.

Also Read : Vijay Hazare Trophy : విరాట్ నే దాటేశారు.. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టాప్-5 బ్యాట‌ర్లు వీరే..!

అండ‌ర్-19  క‌ప్ టీమిండియా : 

ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మ‌ల్హొత్రా (వైస్ కెప్టెన్), వైభ‌వ్ సూర్య‌వంశీ, అరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హ‌ర్ వ‌ర్ద‌న్ సింగ్, అంబ్రిష్, క‌నిస్క్, చౌహ‌న్, ఖిలాన్ ప‌టేల్, హెనిల్ ప‌టేల్, మొహ‌మ్మ‌ద్ ఇనాన్, దిపేష్, కిష‌న్ కుమార్ సింగ్, ఉధ‌వ్ మోహ‌న్.

సౌతాఫ్రికా సిరీస్ కి భార‌త అండ‌ర్ -19 జ‌ట్టు :

వైభ‌వ్ సూర్య‌వంశీ(కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హ‌ర్ వ‌ర్ద‌న్ సింగ్, అంబ్రిష్, క‌నిస్క్, చౌహ‌న్, ఖిలాన్ ప‌టేల్, హెనిల్ ప‌టేల్, మొహ‌మ్మ‌ద్ ఇనాన్, దిపేష్, కిష‌న్ కుమార్ సింగ్, ఉధ‌వ్ మోహ‌న్, యువ‌రాజ్ గోహిల్, రాహుల్ కుమార్.

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×