E-Paper
Advertisement

Vijay Hazare Trophy : విరాట్ నే దాటేశారు.. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టాప్-5 బ్యాట‌ర్లు వీరే..!

Vijay Hazare Trophy :  విరాట్ నే దాటేశారు.. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టాప్-5 బ్యాట‌ర్లు వీరే..!
Advertisement

Vijay Hazare Trophy :  ప్ర‌స్తుతం దేశ‌వాళీ క్రికెట్ లో భాగంగా విజ‌య్ హ‌జారే ట్రోఫీ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ట్రోఫీలో ప‌లువురు క్రికెట‌ర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కొంత మంది అయితే వ‌రుస సెంచ‌రీల‌తో విజృంభిస్తున్నారు. దీంతో విజ‌య్ హ‌జారే ట్రోఫీ మంట‌లు పుట్టిస్తోంది. ముఖ్యంగా టీమిండియా కీల‌క ఆట‌గాడు విరాట్ కోహ్లీ విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఇన్నింగ్స్ ల్లో క‌లిపి 208 ప‌రుగులు చేశాడు. 131.77 స‌గ‌టు  రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ కీల‌క ఆట‌గాడు మంచి ఫామ్ లో కొన‌సాగుతున్నాడు. కానీ విరాట్ కోహ్లీ కంటే కూడా ఐదుగురు ఆట‌గాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. విరాట్ కంటే కూడా వేగంగా ప‌రుగుల‌ను వ‌ర‌ద‌లా పారిస్తున్నారు. విరాట్ కోహ్లీ రికార్డుల‌ను కూడా దాటేసి.. ప‌రుగుల వేట‌లో అగ్ర‌స్థానంలో దూసుకుపోతున్నారు. ఆ ఐదుగురు క్రికెట‌ర్లు ఎవ్వ‌రో ఎప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read : INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య నాలుగో టీ20.. ఈ మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?

1. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (క‌ర్ణాట‌క‌) : 

Advertisement

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో క‌ర్ణాట‌క ఓపెన‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ప్ర‌స్తుతం బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇత‌ను ఆడిన రెండు మ్యాచ్ ల్లో కూడా రెండు సెంచ‌రీల‌ను బాదాడు. అయితే ఏకంగా 271 ప‌రుగుల‌తో టేబుల్ టాప్ లో కొన‌సాగుతున్నాడు. ఇత‌ని స‌గ‌టు 135.50 కాగా.. స్ట్రైక్ రేట్ 106 ఉంది. 22 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

2. ధ్రువ్ షోరే (విద‌ర్భ‌) : 

విద‌ర్భ బ్యాట‌ర్ ధ్రువ్ షోరే ప్ర‌స్తుతం ర‌న్ మిష‌న్ లా మారిపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచ‌రీలు బాది 245 ప‌రుగుల‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇత‌ని స‌గ‌టు కూడా 245 కావ‌డం విశేషం. ఒక ఇన్నింగ్స్ లో నాటౌట్ గా నిలిచాడు. 27 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో షోరో విద‌ర్భ‌కు వెన్నెముక‌లా నిలుస్తున్నాడు.

Advertisement

3. స‌మ‌ర్ గ‌జ్జ‌ర్ (సౌరాష్ట్ర‌)

సౌరాష్ట్ర కు చెందిన స‌మ‌ర్ గ‌జ్జ‌ర్ రెండు మ్యాచ్ ల్లో 215 ప‌రుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ బాదిన ఇత‌ని బెస్ట్ 132. నాటౌట్ నిలిచాడు. నిల‌క‌డ‌గా ఆడుతూ సౌరాష్ట్ర విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

4. ఆర్య‌న్ జుయ‌ల్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్)

ఉత్త‌రప్ర‌దేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఆర్య‌న్ జుయ‌ల్ త‌న బ్యాటింగ్ ప‌వ‌ర్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. రెండు మ్యాచ్ ల్లో కూడా 214 ప‌రుగులు జోడించి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇత‌ను కూడా ఓ సెంచ‌రీ, ఓ హాఫ్ సెంచ‌రీ చేశాడు. 16 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. ప్ర‌స్తుతం ఆర్య‌న్ కూడా మంచి ఫామ్ లో కొన‌సాగుతున్నాడు.

5. స్వస్తిక్ పీపీ సమల్ (ఒడిశా):

ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ సమల్ తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. తొలి మ్యాచ్ పరుగుల పుణ్యమా అని 212 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ 208 పరుగుల మార్కును ఈ ఐదుగురు యువ ఆటగాళ్లు అధిగమించడం విశేషం.

Also Read : Viral Video : క్రికెట్ ఆడిపించుకోలేదని.. గ్రౌండ్ మొత్తం దున్నేసాడు… వీడియో వైరల్

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×