E-Paper
Advertisement

Viral Video: తెగించిన ఎన్నారై మహిళ.. ఖడ్గంతో నడిరోడ్డుపై.. దెబ్బకు వారంతా పరుగో పరుగు, వీడియో వైరల్

Viral Video: తెగించిన ఎన్నారై మహిళ.. ఖడ్గంతో నడిరోడ్డుపై.. దెబ్బకు వారంతా పరుగో పరుగు, వీడియో వైరల్
Advertisement

Viral Video: ఈ మధ్యకాలంలో దోపిడీ దొంగలు తెగబడుతున్నారు. మార్కెట్లో బంగారం ధరలు అమాంతంగా ఆకాశాన్ని తాకడంతో ఇళ్లు, షాపుల వైపు దృష్టి సారించారు. దీంతో దోపిడీలకు తెగబడుతున్నారు. అలా దోపిడీకి వచ్చినవారిని ఖడ్గం పట్టుకుని పరుగులు పెట్టించింది ఓ ఎన్నారై మహిళ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పంజాబ్‌లోని లుధియానాలో దోపిడి దొంగలకు ప్రతిఘటన ఎదురు

Advertisement

పంజాబ్‌లోని లుధియానా ప్రాంతం. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి పంజాబ్‌కు వచ్చింది హర్‌జింద్‌ కౌర్‌ అనే ఎన్‌ఆర్‌ఐ మహిళ. కుటుంబ సభ్యులతో కలిసి లుధియానాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్తోంది.మార్గం మధ్యలో బైక్‌పై కొందరు వ్యక్తులు వారి వాహనాన్ని వెంబడించారు. యువకులు ముఖాలకు ముసుగులు వేసుకుని అనుమానాస్పదంగా కనిపించారు.

ఈ తతంగాన్ని కారులోని ఓ మహిళ వీడియో తీశారు. దీన్ని గమనించిన దోపిడీ దొంగలు కారు అద్దంపై గుడ్లు విసిరడం మొదలుపెట్టారు. పరిస్థితి గమనించిన కారులో వారు భయాందోళనలకు గురయ్యారు. వాహనం డ్రైవింగ్ చేసుకున్న ఎన్నారై మహిళ హర్‌జింద్‌ కౌర్‌, పరిస్థితిని గమనించింది. కారులోని ఖడ్గం తీసుకుని కారు ఆపి బయటకు వచ్చింది.

Advertisement

ఎన్నారై మహిళ ఖడ్గంతో నడిరోడ్డుపైకి రావడంతో పరుగో పరుగు

ఆయుధాన్ని చూపిస్తూ నడి‌రోడ్డుపై వారిని తరిమే ప్రయత్నం చేశారు. సీన్ రివర్స్ అయ్యిందని భావించిన దోపిడీ దొంగలు తోక ముడిచి అక్కడినుంచి పారిపోయారు. దీనిపై కారులోని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

జరిగిన ఘటనపై కౌర్ మీడియాతో మాట్లాడింది. బైక్ పై వచ్చిన వ్యక్తులు వెంబడించి దోచుకోవాలని చూస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దుండగులు కారును ఓవర్‌ టేక్ చేసి మధ్యలో నిర్మాణుష్యమైన ప్రదేశంలో ఆపినట్టు కనిపించిందని తెలిపింది. వాళ్లు వెంబడిస్తారని భావించి ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

ALSO READ: విమానంలోని సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? రీజన్ ఇదే

ఆ సమయంలో కారు దిగుతుండగా వద్దని అత్త వేడుకున్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. వాహనం దిగి కౌర్.. ఖడ్గం పట్టుకుని రోడ్డుపై నడిచినప్పుడు దుండగులు అక్కడి నుంచి పరారైనట్టు తెలిపింది. కొంత దూరం నడుచుకుంటూ  ఆమె కత్తిని గాల్లోకి తిప్పడం చూసి అక్కడి నుంచి వారంతా పారిపోరినట్టు తెలిపింది.

దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.  దోపిడీ దొంగలను ఎదురించిన కౌర్‌ని చాలా ప్రశంసిస్తున్నారు. దుండగులను ఎదిరించడంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎదుర్కొనడానికి కౌర్ లాంటివాళ్లు ఉంటే చాలని అంటున్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×