E-Paper
Advertisement

IND VS NZ 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా..బుమ్రా, అక్ష‌ర్ ఔట్‌..గంభీర్ పై మ‌ళ్లీ ట్రోలింగ్‌

IND VS NZ 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా..బుమ్రా, అక్ష‌ర్ ఔట్‌..గంభీర్ పై మ‌ళ్లీ ట్రోలింగ్‌

IND VS NZ 2nd T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I ) మధ్య ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఐదు టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ రెండవ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ పూర్తికాగా, జనవరి 21 అంటే బుధవారం రోజున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాగపూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాదవ్ సేన, గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

రాయ్ పూర్‌ వేదికగా రెండవ టి20 మ్యాచ్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I ) మధ్య ఇవాళ రాయ్ పూర్‌ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ( Shaheed Veer Narayan Singh International Stadium, Raipur ) వేదికగా రెండవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. సూర్య కుమార్ యాద‌వ్ టాస్ గెల‌వ‌డంతో న్యూజిలాండ్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ రెండవ టి20 మ్యాచ్ జియో హాట్ స్టార్ ( JIO Hotstar ) వేదికగా ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports ) కూడా స్ట్రీమింగ్ కానుంది.

బుమ్రా, అక్ష‌ర్ ఔట్‌..గంభీర్ పై మ‌ళ్లీ ట్రోలింగ్‌

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I ) మధ్య జ‌రుగ‌నున్న రెండో టీ20 నేప‌థ్యంలో బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్ దూరం అయ్యారు. ఈ మేర‌కు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్ బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ త‌రుణంలోనే గంభీర్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. అక్ష‌ర్ ప‌టేల్ కు గాయం అయితే, ఓకే బుమ్రాను ఎందుకు తొల‌గించార‌ని ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. హ‌ర్షిత్ కోసం బుమ్రాను త‌ప్పిస్తారా అంటూ ఆగ్ర‌హిస్తున్నారు.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్లు

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్ర‌వర్తి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (w), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

 

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×