E-Paper
Advertisement

Ind vs NZ 2nd T20I: బ్యాట్ వ‌దిలేసి రిష‌బ్ పంత్ ను కాపీ కొట్టిన ఇషాన్..రెండో టీ20లో టీమిండియా విజ‌యం

Ind vs NZ 2nd T20I: బ్యాట్ వ‌దిలేసి రిష‌బ్ పంత్ ను కాపీ కొట్టిన ఇషాన్..రెండో టీ20లో టీమిండియా విజ‌యం
Advertisement

Ind vs NZ 2nd T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I) మధ్య శుక్రవారం రోజున రెండవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది టీమిండియా. ఇషాన్ కిషన్ అలాగే సూర్య కుమార్ యాదవ్ ఇద్దరూ ఇరగదీయడంతో… రెండవ టి20లో విజయం సాధించి, 2-0 లీడింగ్ సంపాదించింది టీమిండియా. 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు నష్టపోయి, 15.2 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని సాధించింది. ఇక మ‌రో మ్యాచ్ గెలిస్తే, టీమిండియా సిరీస్ గెలుచుకోనుంది. కాగా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ‌రో మూడు టీ20లు జ‌రుగ‌నున్నాయి.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

రిషబ్ పంత్ ను కాపీ కొట్టిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan)

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I) మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ రాయపూర్ ( Shaheed Veer Narayan Singh International Stadium, Raipur ) వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అద్భుతంగా రాణించిన టీమిండియా యంగ్ కుర్రాడు ఇషాన్ కిషన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 32 బంతుల్లో 76 పరుగులు సాధించాడు ఇషాన్ కిషన్. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే 11 బౌండరీలు ఉన్నాయి. 237 స్ట్రైక్ గ్రేడ్ తో ఇరగదీసాడు ఇశాన్ కిషన్. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ను గుర్తు చేశాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan). ఓ భారీ షాట్ ఆడబోయి బ్యాట్ వదిలేసాడు. బంతి తరహాలోని గాల్లో ఎగిరి కింద పడింది బ్యాట్. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. రిష‌బ్ పంత్ తరహా లోనే బ్యాట్ వదిలేస్తున్నాడని ఇశాన్ కిషన్ ను ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

ఫామ్ లోకి వ‌చ్చేసిన సూర్య కుమార్ యాద‌వ్

న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు. చాలా రోజుల నుంచి బ్యాటింగ్ సరిగ్గా చేయలేక సూర్యకుమార్ యాదవ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు సూర్య కుమార్ యాదవ్. 32 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు సూర్య కుమార్ యాదవ్. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 251 స్ట్రైక్ రేట్ తో ఇరగదీసాడు సూర్యకుమార్. అటు చివరిలో వచ్చిన శివం దుబే కూడా 18 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. 200 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన శివం దుబే మూడు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ సాధించాడు.

Advertisement

 

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×