IND VS NZ 3rd Odi: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య ఇవాళ చిట్టచివరి వన్డే జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు కీలక వన్డేలు పూర్తయ్యాయి. ఇందులో చెరొకటి గెలిచాయి. ఇక ఇవాళ తాడోపేడో రెండు జట్లు తేల్చుకోబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా, మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతోంది. సాయంత్రం పూట పిచ్ మొత్తం మంచు కురిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే టాస్ నెగ్గిన కెప్టెన్ గిల్ ( Shubman Gill), మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది టీమిండియా కు చాలా అడ్వాంటేజ్ కానుంది.
Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైనల్..ఇక మనోళ్లను ఆపడం కష్టమే
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య మరికాసేపట్లో మూడవ వన్డే ప్రారంభం కానుంది. ఈ మూడవ వన్డే ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ( Holkar Cricket Stadium, Indore ) వేదికగా జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ గిల్, బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో టీమిండియా విజయం సాధిస్తే, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. లేకపోతే న్యూజిలాండ్ విజయం సాధిస్తే వాళ్ళకే ట్రోఫీ వెళ్తుంది. ఇప్పటివరకు అయితే చెరో మ్యాచ్ గెలిచి ఉన్నారు. కాబట్టి రెండు జట్లకు కీలకంగా ఈ మ్యాచ్ మారింది. జియో హాట్ స్టార్ ( Jio Hot Star ) వేదికగా ఈ మ్యాచ్ లు ఉచితంగా ప్రసారమవుతాయి. స్టార్ స్పోర్ట్స్ ( Star Sports) వేదికగా కూడా ఈ మ్యాచ్ లు వస్తున్నాయి. ఇక మూడవ వన్డే నేపథ్యంలో టీమిండియా జట్టులోకి కొత్త ప్లేయర్ వచ్చాడు. ప్రసిద్ కృష్ణను పక్కకు పెట్టిన గిల్.. అతని స్థానంలో డేంజర్ ఆటగాడు అర్షదీప్ సింగ్ ను బరిలోకి దింపాడు.
టీమిండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్
Shubman Gill won the toss and has elected to bowl against New Zealand in the 3rd ODI in Indore 🏏
Here are the playing XIs of both sides.#INDvNZ #CricketTwitter pic.twitter.com/mX6giI9o5t
— InsideSport (@InsideSportIND) January 18, 2026