E-Paper
Advertisement

BRS : అప్పుడు ఇప్పుడు ఫాంహౌస్‌లోకి నో ఎంట్రీ.. మాజీ మంత్రులు ఏం చేస్తారు?

BRS : అప్పుడు ఇప్పుడు ఫాంహౌస్‌లోకి నో ఎంట్రీ.. మాజీ మంత్రులు ఏం చేస్తారు?

గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ నాడు నేడు ఒకే విధంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా ఆయన తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదని రాష్ట్ర రాజకీయాల్లో, గులాబీ వర్గంలోనూ జోరుగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్దకు ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అపాయింట్‌మెంట్ తప్పనిసరి. పదేండ్ల వరకు ఆయన అలాగే తన పాలనను కొనసాగించారు. ప్రస్తుతం అధికారానికి దూరం అయ్యాక సైతం అప్పటి మంత్రులు అంతా ఇప్పుడు మాజీలు అయ్యారు. ఇప్పుడు కూడా వారికి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఉంటేనే కలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పవర్ లేకపోయినా అంతేనా?

అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి చాలా పనులు ఉంటాయి. అధికారులతో నిత్యం సమీక్షలు, కొత్త ప్రాజెక్టులు,సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల హడావుడి, పార్టీలో పదవుల భర్తీ, అసంతృప్తులతో మాట్లాడటం, కొత్త వారిని చేర్చుకోవడం ఇవన్నీ నేరుగా ముఖ్యమంత్రి చేయకపోయినా ఆయన సలహాలు, సూచనలు తప్పకుండా ఉంటాయి. అప్పుడు ఆయన ఎవరినైనా కలవాలంటే ముందుగా ఫిక్స్ అయిన కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే సీఎం అపాయింట్ మెంట్ తప్పనిసరి. మరి ఇప్పుడు అధికారం లేదుగా.. మరల పార్టీ అధికారంలోకి రావాలంటే కేవలం కేసీఆర్ ఒక్కరి వల్లే కాదుగా.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర,జిల్లా స్థాయి కీలక నేతలు, కార్యకర్తలు అంతా సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తేనే కాదా అధికారం సాధ్యం.. ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు ఇంకా గుర్తించడం లేదు.. వారిని ఎందుకు కలువడం లేదనే చర్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

గుర్తింపు లేకనే బయటకు..

2023 జనరల్ ఎలక్షన్స్ ముందు .. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేసిన పలువురు తమకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని, కేసీఆర్ సరిగా పట్టించుకోవడం లేదని అందులో నుంచి బయటకు వచ్చారు. వారిలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు వంటి కీలక నేతలు ఉన్నారు.వీరంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి ఇద్దరు కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడమే కారణమని గులాబీ నేతలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇదిలాఉంటే మాజీ మంత్రులకు ఇప్పటికీ కూడా ఫాంహౌస్‌లోకి అనుమతి దొరకడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Kakinada Hope Island: కాకినాడ మరో శ్రీహరికోట.. హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!

ఈ విషయంలో వారంతా నారాజ్‌గా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడూ తమకు పెద్దగా కేసీఆర్ ప్రయారిటీ ఇవ్వలేదని.. తాము కలువాలని, నియోజక సమస్యలు, ప్రజల్లో పార్టీపై ఎదురవుతున్న వ్యతిరేకతను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నా.. ఆయన చుట్టూ ఉన్న వారు తమను పట్టించుకోలేదని.. ఈ విషయాన్ని గులాబీ బాస్ దృష్టికి తీసుకెళ్లలేకపోయారని.. మాజీ మంత్రులంతా నేటికీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు కూడా తమకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని వారంతా తీవ్ర నిరాశతో ఉన్నట్టు తెలుస్తున్నది. కేవలం ఒకరిద్దరిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారని.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారు? వారికి ఏం కావాలి? అనేది కేసీఆర్ దృష్టికి ఎలా తీసుకెళ్లాలి? అని మదన పడుతున్నట్టు టాక్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికైనా తమను పిలిపించుకుని క్షేత్రస్థాయిలో సమస్యలు, కేడర్ సమస్యలను పట్టించుకుంటే పార్టీకి మంచి జరుగుతుందని వారంతా ఆశిస్తున్నట్టు సమాచారం.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×