E-Paper
Advertisement

IND VS NZ Odi Series: న్యూజిలాండ్ వ‌న్డేలు, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి వాష్టింగన్ సుంద‌ర్ ఔట్ ? కొత్త‌గా ఎవ‌రు వ‌స్తున్నారంటే

IND VS NZ Odi Series: న్యూజిలాండ్ వ‌న్డేలు, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి వాష్టింగన్ సుంద‌ర్ ఔట్ ? కొత్త‌గా ఎవ‌రు వ‌స్తున్నారంటే
Advertisement

IND VS NZ Odi Series: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ( India vs New Zealand, 1st ODI) జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ దూరం కాగా ఇప్పుడు మరో డేంజర్ ఆల్ రౌండర్ కూడా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా గాయం బారిన పడ్డాడు వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ). అతని వెన్ను కండరాలు పట్టేయడంతో బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు వాషింగ్టన్ సుందర్. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఏడవ స్థానంలో బ్యాటింగ్ లో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికి గాయం కావడంతో న్యూజిలాండ్ తో జ‌రుగుతోన్న‌ వన్డే సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ 2026 కు కూడా దూరమవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

టి20 ప్రపంచ కప్ 2026 నుంచి వాషింగ్టన్ సుందర్ అవుట్ ?

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రారంభంలోనే వాషింగ్టన్ సుందరకు గాయమైంది. వెన్ను కండరాలు పట్టేయడం అంటే సైడ్ స్ట్రైన్ ఎఫెక్ట్ కారణంగా వాషింగ్టన్ సుందర్, న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేదు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేశాడు వాషింగ్టన్ సుందర్. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వెళ్లి రెస్ట్ తీసుకున్నాడు. అయితే అతని గాయం చాలా తీవ్రమైనది అని తెలుస్తోంది. అందుకే బ్యాటింగ్ చేసే సమయంలో కూడా అతను ముందుగా రాలేదు.

వికెట్లు పడుతున్న క్రమంలో, కచ్చితంగా బ్యాటింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఏడవ వికెట్ కు బరిలోకి దిగాడు వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ పరుగు తీయలేక ఇబ్బంది పడ్డాడు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫినిష్ చేసుకున్నాడు. అయితే ఈ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేలు, 5 t20 లకు వాషింగ్టన్ సుందర్ దూరమవుతాడని అంటున్నారు. అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు నెల రోజుల సమయం కూడా లేదు. వాషింగ్టన్ సుందర్ గాయం తీవ్రతరం అయితే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు కూడా దూరమవుతాడు అంటున్నారు.

వాషింగ్టన్ ( Washington Sundar ) స్థానంలో ఎవరంటే ?

Advertisement

వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వన్డేల తో పాటు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు దూరం అయితే, చాలామంది ప్లేయర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముందుగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో చూసుకున్నట్లయితే.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రింకు సింగ్ ను ఎక్కువగా వాడుకునే ఛాన్సులు ఉన్నాయి. లేదా శివం దూబేకు తుది జట్టులో ఎక్కువ అవకాశాలు వస్తాయి. లేదా వాషింగ్టన్ సుందర్ స్థానంలో కచ్చితంగా కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జట్టులో ఉన్నారు. రిజర్వు బెంచ్ లో ఉన్న వీళ్ళకు ఎక్కువగా అవకాశాలు దక్కే ఛాన్సులు ఉంటాయి. అటు న్యూజిలాండ్ తో జరిగే మిగిలిన వన్డేల కోసం, హార్దిక్ పాండ్యాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. రేపు దీనిపై ప్రకటన కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ కాబట్టి అతని స్థానంలో వన్డేలో హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×