E-Paper
Advertisement

JC Vs Kethireddy: హీటెక్కిన సీమ.. కేతిరెడ్డి Vs జేసీ

JC Vs Kethireddy: హీటెక్కిన సీమ.. కేతిరెడ్డి Vs జేసీ

JC Vs Kethireddy: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు ఎప్పుడూ రగులుతుంటూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఎప్పటికప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటూ కాక రేపుతున్నారు. ఇప్పుడు సీన్లోకి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది… వెంకట్రామిరెడ్డి రాయలసీమ పౌరుషంపై చేసిన వ్యాఖ్యలతో జేసీ ప్రభాకరరెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.. ఆ ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆ రగడ ఏ టర్న్ తీసుుకుంటుందో అని స్థానికంగా టెన్షన్ మొదలైందంట.

రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి వ్యాఖ్యలు

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన రాయలసీమ పౌరుషం వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి… లేని రాయలసీమ పౌరుషంతో… ఉప్పు కారం తినడం… పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప… రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఎవరు మాట్లాడటం లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు… నేను రాయలసీమ బిడ్డని నాకు రాయలసీమ పౌరుషం ఉంది… కేతిరెడ్డి కుటుంబానికి రాయలసీమ పౌరుషం లేదని… జేసీ ప్రభాకర్ రెడ్డి… కేతిరెడ్డిని ఎటాక్ చేశారు…ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి… రాయలసీమ ప్రజాప్రతినిధులకు పౌరుషం లేదని.. లేని పౌరుషంతో ఉప్పు కారం తిని తొడలు కొట్టడం..ఏం చేయలేరన్న కామెంట్స్ పై సహజంగా తన రాజకీయ ప్రత్యర్థి అయిన జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు

వెంకట్రామిరెడ్డికి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన జేసీ

జెసి ప్రభాకర్ రెడ్డి తాను రాయలసీమ బిడ్డనేనని… తనకు పౌరుషం ఉందని కేతిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు… ఇంకోసారి రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదంటే… కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారన్నారు. ఐదేళ్లు ఉప్పు కారం తిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలకి 16 నెలలుగా రాయలసీమ పౌరుషం ఎక్కడికి పోయిందని జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి ధర్మవరంలో షో చేశాడని… కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి పౌరుషం లేకపోతే… రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా??? అని జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

తాడిపత్రి వచ్చి సీమ పౌరుషం చూపించాలని జేసీ సవాల్

రాయలసీమ పౌరుషం ఏంటో ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి… తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్ద రెడ్డికి ప్రజలే చూపిస్తారన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి… పౌరుషం లేని కేతిరెడ్డి కుటుంబం… రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా అంటూ… చీము రక్తం ఉంటే… దమ్ముంటే తాడిపత్రికి వచ్చి రాయలసీమ పౌరుషం చూపించాలని సవాల్ విసిరారు జెసి ప్రభాకర్ రెడ్డి… దమ్ముంటే రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని, రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారో… జగన్ ఏం చేసారో చర్చల్లో తేల్చుకుందామన్నారు. మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తామెంటో చూపిస్తామంటున్న కేతిరెడ్డి… మూడేళ్లు దాకా ఎందుకు? ఇప్పుడే రండి… రాయలసీమ పౌరుషం చూపించండి అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు…

జేసీ వ్యాఖ్యలపై స్పందించిన కేతిరెడ్డి

జెసి వ్యాఖ్యలపై కేతిరెడ్డి కూడా మరోసారి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించాడు… ఇప్పటికీ తాను రాయలసీమ పౌరుషంపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి కట్టుబడే ఉన్నానన్నారు. ప్రభాకర్ రెడ్డికి చేతనైతే అనంతపురం నుంచి వెళ్లిన ఎయిమ్స్ ఆసుపత్రి… కర్నూల్ నుంచి వెళ్లిన హైకోర్టును వెనక్కు తీసుకురావాలని ఘాటుగా స్పందించారు … తాను చేసిన వ్యాఖ్యలపై పౌరుషం చూపిస్తున్నారు తప్ప… వేరే ఏం కనిపించడం లేదన్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి… ఇప్పటికీ చెప్తున్నాను సీమ పౌరుషం అని చెప్తూ ఉప్పు కారం లో చూపిస్తున్నారు తప్ప… రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పౌరుషం చూపించడం లేదని మరోసారి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు…

జేసీకి కేతిరెడ్డి కౌంటర్

అలాగే జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని… జేసీ వయసుతోపాటు జోకర్ అయ్యారని… మీ పౌరుషం రేవంత్ రెడ్డి మీద చూపించండి అంటూ… కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు… ఈ ఇద్దరు సవాల్ ప్రతి సవాల్ తో మరోసారి రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ మళ్లీ పెరిగిపోతోంది.

Story by: Ajay, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×