E-Paper
Advertisement

BJP: బస్తీమే సవాల్.. మున్సిపల్‌పై బీజేపీ స్కెచ్ ఇదేనా..?

BJP: బస్తీమే సవాల్.. మున్సిపల్‌పై బీజేపీ స్కెచ్ ఇదేనా..?

BJP: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా గెలుచుకోలేదు. సంఖ్య కూడా దాటలేక పోయారు.. ? గ్రామ పంచాయితీలు సరే,..? మరి మున్సిపాలిటీల లెక్కలేంటి..? కాషాయ వనాన్ని కాకులు, గద్దలు వినాశనం చేస్తున్నాయన్న ప్రధాన చర్చ ఆ పార్టీని వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో… బూత్ స్థాయిలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? సర్పంచ్ ఎన్నికల్లో తలకిందులైన కాషాయా లెక్కల్ని మున్సిపల్ ఎన్నికల్లో సరి చేస్తారా..?

మున్సిపల్ ఎన్నికలకు పెద్ద స్కెచ్ గీస్తున్న బీజేపీ

మున్సిపోల్స్ బరిలో కమలం పార్టీ బిగ్ మూవింగ్ అంటూ బూతు స్థాయి నుంచే పవర్ ఫుల్ ప్లాన్ కు స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో చెక్ మెట్ పెట్టేందుకు ప్రణాళికలకు పదును పెడుతుంది. మున్సిపాల్టీల ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక దశ ప్రారంభం కాబోతుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేస్తూ పరివార్ పార్టీ పక్కా స్కెచ్ లతో ఎన్నికల మోడ్‌లోకి వెళ్ళాలని చూస్తోంది. గ్రామ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్‌తో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ కుర్చీలే లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది..

పార్టీ శ్రేణులకు అభయ్‌పాటిల్ దిశానిర్దేశం

తాజాగా రాష్ట్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై కీలక సమావేశానికి, రాష్ట్ర పొలిటికల్ ఇంచార్జ్ అభయ్ పాటిల్ దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ్ అభియాన్ వర్క్‌షాప్‌తో పాటు ఆఫీస్ బేరర్ల సమావేశంలో సైతం పార్టీ పెద్దలు నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారంట. ఎన్నికలు అనేవి క్యాడర్‌తోనే గెలుస్తాం, క్యాడర్‌ను సన్నద్ధం చేయాలి, కలుపుకొని వెళ్లాలి, బూత్ స్థాయిలో బలపడాలి లేదంటే ఎన్ని వ్యూహాలు రచించిన అంత వృధానే అని , రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచంద్రరావు, రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత రాష్ట్ర ఇన్చార్జి చంద్రశేఖర్ తివారి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారంట. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో ఆచరణ లేకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారంట

గ్రౌండ్ లెవల్లోకి వెళ్లేందుకు రోడ్ మ్యాప్ రెడీ

అందులో భాగంగానే బూత్‌లను బీజేపీ టార్గెట్‌గా చేసుకొని గ్రౌండ్ లెవల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే బూత్ స్థాయిలో బలోపేతమే కీలకమని కమలదళం అంచనా వేస్తోంది. అందుకే ప్రతి బూత్‌ను ఒక రాజకీయ యూనిట్‌గా మార్చుకొని, నేతలు కార్యకర్తలు, ప్రజల మధ్య నిత్యం ఉండాలని, బూత్ స్వస్థీకరణపై సమీక్ష జరిపి, బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి డిల్లీ దూతలు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కార్యాలయాన్ని వదిలి పెట్టాలని, హైదరాబాద్ సరి హద్దులు దాటి, గ్రామాల పొలిమేరలు పట్టుకొని తిరగాలని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి నేరుగావెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పెద్దలు సూచించారంట

జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహణకు సన్నాహాలు

అంతేకాదు ఉపాధి హామీ పథకం అంశాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని గ్రౌండ్ లెవల్లో తిప్పి కొట్టి, పథకం పేరు మారినా లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం లేదని, గతంతో పోలిస్తే పని దినాలు పెరిగాయన్న వాస్తవాలతో ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. సంస్థాగత నిర్మాణమే అసలు ఎజెండాగా బీజేపీ ఈసారి మాటలతో కాదు చేతలతో ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహించి మండల స్థాయి వరకు సంస్థాగత పనిని విస్తరించాలని స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి హై కమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగాంగానే రాష్ట్ర పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ, ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్‌చార్జిని నియమించాలన్న నిర్ణయం తీసుకుందంట. ఇంచార్జ్‌ల ఆధ్వర్యంలో ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించి, మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉండటంతో, దానికి సంబంధించిన కమిటీని తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలపై నిఘా కోసం స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రణాళికలు, వ్యూహాలు బాగానే ఉన్నప్పటికీ పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ ఆపరేషన్ సింధూర్ లెవల్లో జరుగుతున్న నేపద్యంలో, ప్రస్తుతం కాకులు, గద్దలు దూరి కాషాయ వనాన్ని పాడు చేస్తున్నాయన్న చర్చ ఉన్న సిచ్యూవేషన్ లో… కమలదళం అంచనాలు గుణింతాలు వర్కౌట్ అవుతాయా..? గ్రౌండ్ లెవల్ క్యాడర్, బూత్ స్థాయిలో వ్యూహాలు, ప్రజల్లోకి నేరుగా వెళ్లే కార్యాచరణ వంటి అంశాలు బీజేపీని మున్సిపల్ బరిలో బలంగా నిలబెడతాయా..? లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలకి ఎదురెళ్లి మరోసారి బొక్కబోర్ల పడుతుందా అన్నది చూడాలి.

Story by: Ajay, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×