E-Paper
Advertisement

Gambhir-Kohli: గంభీర్ డౌన్ డౌన్ అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు..మైండ్ దొబ్బిందా అంటూ కోహ్లీ వార్నింగ్

Gambhir-Kohli: గంభీర్ డౌన్ డౌన్ అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు..మైండ్ దొబ్బిందా అంటూ కోహ్లీ వార్నింగ్
Advertisement

Gambhir-Kohli:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారంతో వన్డే సిరీస్ ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 వన్డేల సిరీస్ ను కోల్పోయింది టీమిండియా. దీంతో గౌతమ్ గంభీర్ పైన దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం ఆరు సిరీస్ లు టీమిండియా కోల్పోయిందని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇందులో భాగంగానే ఇండోర్ వేదికగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు.. వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

Advertisement

న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు కొత్త టెన్షన్ మొదలు అయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి వచ్చే ప్రెషర్ కంటే… టీమిండియా అభిమానుల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఇండోర్ వేదికగా మూడవ వన్డే పూర్తయిన తర్వాత ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది బీసీసీఐ. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు టీమిండియా అభిమానులు. ఇండోర్ స్టేడియానికి వచ్చిన అభిమానులు రెచ్చిపోయి… గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే అక్కడే ఉన్న గౌతమ్ గంభీర్, టీమిండియా స్టాప్, హర్షిత్, నితీష్ కుమార్ రెడ్డి, శ్రేయాస్ అయ్యర్ ఈ నినాదాలు విన్నారు. అటు విరాట్ కోహ్లీ కూడా అక్కడే ఉన్నాడు. గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. స్టేడియంలో నిలుచొని… అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అసలు మీకు మైండ్ దొబ్బిందా..? గౌతమ్ గంభీర్ ను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని ఫైర్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు స్టేడియం నుంచే సైగలు చేశాడు. అయినా కూడా గంభీర్ కు నెగిటివ్ గా నినాదాలు చేశారు జనాలు. దీంతో ఒక గౌతమ్ గంభీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన వీడియో వైరల్ గా మారింది.

రేపటి నుంచి టి20 సిరీస్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్ కోసం టీమిండియా అలాగే న్యూజిలాండ్ సిద్ధమైంది. రేపటి నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ముందు ప్రాక్టీస్ లాగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది. ఇది గెలిచి ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో దుమ్ము లేపాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

Related News

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

Big Stories

Advertisement
×