E-Paper
Advertisement

Ind vs Sa 1st Test: టాస్ ఓడిన టీమిండియా.. ముగ్గురు స్పెషల్ బౌలర్లతో గిల్ స్కెచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Ind vs Sa 1st Test: టాస్ ఓడిన టీమిండియా.. ముగ్గురు స్పెషల్ బౌలర్లతో గిల్ స్కెచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Advertisement

Ind vs Sa 1st Test: భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 {నేడు} ప్రారంభం అయ్యింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తీవ్రంగా సిద్ధమైంది. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ ని జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు వీక్షించవచ్చు. ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Also Read: Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లైందా..? ఆమె భ‌ర్త ఇత‌నేనా..సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్

Advertisement

ఇక టాస్ గెలిచిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మేము వీలైనంత ఉత్తమ ప్రదర్శన చేస్తామని అన్నాడు. పిచ్ పొడిగా కనిపిస్తున్నందున మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు కీలకమని.. అందుకే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. ఇక భారత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ సహకరిస్తుందని భావిస్తున్నామన్నాడు. అలాగే ఈ టెస్ట్ సిరీస్ తమకు చాలా ముఖ్యమని.. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో రిషబ్ పంత్ తిరిగి వచ్చాడని, అలాగే అక్షర్ పటేల్ కూడా తిరిగి జట్టులో భాగమయాడని తెలిపాడు.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (WC), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Advertisement

దక్షిణాఫ్రికా జుట్టు: ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(C), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రేన్నే(WC), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్.

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 44 టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత జట్టు 16 విజయాలు సాధించగా.. దక్షిణాఫ్రికా 18 మ్యాచ్ లలో గెలిచి స్వల్ప ఆదిక్యంలో నిలిచింది. ఇక మరో 10 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. భారత గడ్డపై 19 మ్యాచ్ లు ఆడిన దక్షిణాఫ్రికా.. ఐదు మ్యాచ్లలో గెలిచి, మరో మూడు మ్యాచ్ లను డ్రా గా ముగించింది. అంతమాత్రాన దక్షిణాఫ్రికా జుట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌత్ ఆఫ్రికా ఓసారి భారత్ లోనే టీం ఇండియాను ఓడించి సిరీస్ ని కైవసం చేసుకుంది.

Also Read: Mohsin Naqvi: పాకిస్తాన్ నుంచి పారిపోతామని బెదిరింపులు.. శ్రీలంక ప్లేయర్ల కాళ్ళు పట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ

2000 సంవత్సరంలో భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా జట్టు రెండు టెస్టుల సిరీస్ ని 2-0 తో కైవసం చేసుకొని భారత్ కి షాక్ ఇచ్చింది. వాంఖడే లో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా.. బెంగళూరులో జరిగిన రెండవ టెస్టులో 71 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇక భారత్ లో సౌత్ ఆఫ్రికా చివరగా 2008 ఫిబ్రవరి లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ తరువాత భారత్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా గెలవలేదు.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×