E-Paper
Advertisement

Honey for Face: ముఖానికి తేనె రాసుకున్నారంటే మొటిమలు తగ్గి మెరుపు రావడం ఖాయం

Honey for Face: ముఖానికి తేనె రాసుకున్నారంటే మొటిమలు తగ్గి మెరుపు రావడం ఖాయం
Advertisement

చర్మ సంరక్షణ కోసం రసాయనాలు ఉన్న క్రీముల కంటే ఇంట్లో దొరికే సహజ పదార్థాలను వాడడమే మంచిది. ఇందులో ప్రధానమైనది తేనె. సాధారణంగా తేనెను ఆహారంగా ఉపయోగిస్తారు. చర్మాన్ని అందంగా ఉంచడంలో కూడా ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖంపై తేనె రాస్తే వచ్చే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె సహజంగా నీటిని శోషించుకునే గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మంలో తేమను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ముఖం కడిగిన తర్వాత తేనెను రాస్తే చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. పొడిచర్మం కలిగిన వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

మొటిమల సమస్య తగ్గుతుంది
తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఉండే బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. తరచుగా మొటిమలు వచ్చే వారికి తేనె మంచి పరిష్కారం. ముఖంపై తేనెను పలచని పొరగా రాసి పది నిమిషాలు ఉంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా, మొటిమల మచ్చలు కూడా నెమ్మదిగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. రోజూ బయట తిరగడం వల్ల ధూళి, కాలుష్యం కారణంగా రంధ్రాల్లో మురికి చేరిపోతుంది. తేనె చర్మంలోని లోతైన మురికిని బయటికి తీయగల సహజ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తూ పొడి, నిగారింపు కోల్పోయిన చర్మాన్ని మళ్లీ తాజాగా చూపిస్తుంది.

ముడతలు రావు
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంలో వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ముడతలు తగ్గడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మం నాశనం చేయగల ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొంటాయి. క్రమంగా తేనె మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా, యవ్వనంగా కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తేనెను తరచూ రాస్తే చర్మం మసకగా కనిపించడాన్ని తగ్గిస్తుంది. ముఖంపై తేనె రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది.

Advertisement

మచ్చలు తగ్గడంలో సహాయం
సన్నటి గీతలు, చిన్నపాటి మచ్చలు ఉన్నవారు తేనె వాడటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. రసాయనాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వాడితే కొంతమందికి అలర్జీ వస్తుంది. కానీ తేనె సహజమైనది. సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది సురక్షితంగా ఉంటుంది. అయితే చాలా అరుదుగా కొందరికి తేనె అలర్జీ ఉండే అవకాశం ఉంది. ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాక వాడితే మంచిది.

ఎలా వాడాలి?
ముఖం కడిగిన తర్వాత తేనెను నేరుగా ముఖంపై రాసి పావుగంట పాటు ఉంచండి. తేనెలో నిమ్మరసం, పసుపు, ఓట్స్ పొడి వంటివి కలిపి రాస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వారానికి రెండు మూడు సార్లు ఈ తేనెను ముఖానికి రాస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×