Vladimir putin India Visit: రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రాష్ట్రపతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ఆయనను సాదరంగా స్వాగతించారు. అనంతరం సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ద్వైపాక్షి, రక్షణ,వాణిజ్య అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య సుమారు 25 ముఖ్యమైన ఒప్పందాలు జరగనున్నాయి.
India welcomes Russian President Vladimir Putin
Ceremonial reception at Rashtrapati Bhavan
President Droupadi Murmu and Prime Minister @narendramodi give warm welcome to the President.@rashtrapatibhvn
@PMOIndia
@RusEmbIndia
@IndEmbMoscow
@MEAIndia #IndiaRussia pic.twitter.com/AliHaKnVO4— PIB in KERALA (@PIBTvpm) December 5, 2025
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జరిగిన ఆయన భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ మరింత బలోపేతం కానుంది. నిన్న సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన పుతిన్ కు ప్రధాని మోడీ ప్రొటోకాల్ ను పక్కన పెట్టి నేరుగా వెళ్లి స్వాగతం పలికారు. ఉక్రెయిన్ తో యుద్ధం, అమెరికా భారత్ పై భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఈ పర్యటను నిషితంగా పరిశీలిస్తున్నాయి.
పుతిన్ డిసెంబర్ 4న సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మోడీతో ప్రైవేట్ డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో సెరిమోనియల్ వెల్ కమ్, త్రివిధ దళాల గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కాసేపట్లో ఆయన రాజ్ ఘాట్ లో గాంధీజీ స్మారకానికి నివాళి అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో మోడీతో బైలాటరల్ మీటింగ్, ఒప్పందాలపై సంతకాలు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అనంతరం భారత్-రష్యా బిజినెస్ ఫోరమ్ సమావేశం ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాస్ట్ చేసిన డిన్నర్ పార్టీలో పాల్గొని రాత్రికి పుతిన్ రష్యాకు వెళ్లనున్నారు.
Welcomed my friend, President Putin to 7, Lok Kalyan Marg.@KremlinRussia_E pic.twitter.com/2L7AZ1WIph
— Narendra Modi (@narendramodi) December 4, 2025
పుతిన్ భారత పర్యటన సందర్భంగా సుమారు 25 కీలక ఒప్పందాలు జరిగే అవకావం ఉంది. 10 ప్రభుత్వ ఒప్పందాలు, 15కు పైగా కమర్షియల్/నాన్-కమర్షియల్ ఒప్పందాలు జగరనున్నాయి. వీటిలో ఎక్కువగా రక్షణ, వాణిజ్యం, ఎనర్జీ రంగాలకు చెందినవి ఉన్నాయి.
⦿ రక్షణ: ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో కీలక RELOS (Reciprocal Exchange of Logistics Support) ఒప్పదం జరగనుది. సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ సపోర్ట్, ట్రూప్స్ ఎక్స్చేంజ్, మరిన్ని S-400 మిస్సైల్ వ్యవస్థలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లుపై ఒప్పందం జరగనుంది. S-500 అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్, బ్రహ్మోస్ మిస్సైల్ అప్‌గ్రేడ్, హైపర్ సోనిక్ సిస్టమ్స్ సహకారానికి సంబంధించి ఇరుదేశాలు అగ్రిమెంట్ చేసుకుంటాయి.
⦿ వాణిజ్యం- ఆర్థికం: రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యతకు చర్చలు జరుగుతాయి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)కు సంబంధించి చర్చలు జరుగుతాయి. షిప్పింగ్, ఎరువులు కనెక్టివిటీ రంగాల్లో MoUలు కుదరనున్నాయి.
Read Also: నీటిలో తేలుతుంది.. క్షిపణి దాడిని తట్టుకుంటుంది, రష్యా ప్రెసిడెంట్ కారు ప్రత్యేకతలు ఇవే!
⦿ లేబర్ మొబిలిటీ: ఈ ఒప్పందంతో భారతీయ కార్మికులు రష్యాకు వెళ్లడానికి మరింత సులభం అవుతుంది. IT, ఫార్మా వంటి రంగాల్లో లేబర్ షార్టేజ్‌లకు స్కిల్డ్ వర్కర్స్ ఫ్రేమ్ వర్క్ జరగనుంది.
⦿ ఆరోగ్యం, వ్యవసాయం: హెల్త్ కేర్ సహకారం, ఫార్మా ఇండస్ట్రీ, అకాడమిక్ ఎక్స్చేంజ్‌లు, వ్యవసాయ రంగంలో సహకారం, ఎనర్జీ సరఫరా, లాజిస్టిక్ సపోర్ట్, ఐక్యరాష్ట్ర సమితి, SCO, G20, BRICSలో సహకారంపై కీలక ఒప్పందాలు జరగనున్నాయి. .
ఈ ఒప్పందాలు భారత్ ఎనర్జీ సెక్యూరిటీ, రక్షణ సరఫరాలు, వాణిజ్య అభివృద్ధికి సహాయపడతాయి. పుతిన్-మోడీ మీటింగ్ లో ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. మొత్తంగా, ఈ పర్యటన భారత్-రష్యా బంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Delighted to welcome my friend, President Putin to India. Looking forward to our interactions later this evening and tomorrow. India-Russia friendship is a time tested one that has greatly benefitted our people.@KremlinRussia_E pic.twitter.com/L7IORzRfV9
— Narendra Modi (@narendramodi) December 4, 2025
Read Also: ఫుడ్ ల్యాబ్.. సూట్‌కేసులో మలం.. పుతిన్‌తో ఇవి ఉండాల్సిందే, ఆ పరీక్షల తర్వాతే తింటాడట!