Actor Death: చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదఛాయలు అలుముకున్నాయి. సినిమా ఇండస్ట్రీకి విశేషమైన సేవలు అందించిన ఎంతోమంది నటులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఆ నటులు దూరమైన కూడా వాళ్లు చేసిన పాత్రలు మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సినిమా యొక్క గొప్పతనం. మనుషులు శాశ్వతం కాకపోయినా వాళ్ళ క్రియలు కొన్ని రోజులు మాట్లాడుకునే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు తుది శ్వాస విడుస్తూ అభిమానులను తీరని దుఃఖానికి గురి చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే అనారోగ్య సమస్యలతో మరణించే సెలబ్రిటీల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక నటుడు క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు.
గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతూ ప్రాణాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన ప్రముఖ ఇరానీయన్ నటుడు హోమాయున్ ఎర్షాది (Homayoun Ershadi) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఈయన నవంబర్ 11న తుది శ్వాస విడిచినా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిజానికి ఆర్కిటెక్ట్ అయిన ఈయనకు 50 సంవత్సరాల వయసులో తొలిసారి హీరోగా నటించే అవకాశం లభించింది. అలా 1970లో ‘ టేస్ట్ ఆఫ్ చెర్రీ’ అనే చిత్రంతో మొదటి సారి ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత 2007లో ‘ది కైట్ రన్నర్’ సినిమాలో బాబా పాత్రతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఇప్పుడు క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూయడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
1947 మార్చి 26న ఇస్ఫహాన్ లో జన్మించారు. వెనిస్ లోని కా ఫోస్కారి విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ అధ్యయనం చేయడం కోసం ఇటలీ వెళ్ళిన ఈయన.. 1970లో పట్టభద్రుడు అయ్యాడు. ఇరానీయం విప్లవం తర్వాత 1979లో కెనడాకి వెళ్లే ముందు ఇరాన్ లో ఆర్కిటెక్టివ్ గా కూడా పనిచేశారు. ఇకపోతే వివాహం అనంతరం తన భార్యతో కలిసి వాంకోవర్ లో స్థిరపడిన ఈయనకు.. భార్యతో విభేదాలు రావడంతో విడాకులకు దాఖలు చేసి, 1990లో ఇరాన్ కు తిరిగి వచ్చారు. ఇరాన్ కు తిరిగి వచ్చి.. టెహ్రాన్ లో స్థిరపడ్డ ఈయన.. ఒకసారి ట్రాఫిక్ లో ఇరుక్కొని తన కారులో కూర్చోగా .. దర్శకుడు అబ్బాస్ ఈయనను గుర్తించి అతని వద్దకు వెళ్లి మరీ టేస్ట్ ఆఫ్ చెర్రీ లో ప్రధాన పాత్ర పోషించమని అభ్యర్థించారట. అప్పుడు ఆయన వయసు 50 సంవత్సరాలు కావడం గమనార్హం. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటుడిగా పేరు దక్కించుకున్నారు.