IND VS SA T20I Series: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్టులతో పాటు వన్డే సిరీస్ కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి టి20 సిరీస్ పైన పడింది. మొదటి జరిగిన టెస్ట్ సిరీస్ దక్షిణాఫ్రికా గెల్చుకోగా, వన్డే సిరీస్ లో టీం ఇండియా ప్రతికారం తీర్చుకుంది. 3 వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంటు రేపటి నుంచే ప్రారంభం కానుంది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానంది. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం ఖరారు అయింది. రేపు అంటే డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా మొట్ట మొదటి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం కానుంది. అంటే 6:30 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇలా 5 టీ20 లు కూడా సాయంత్రం ఏడు గంటలకే ప్రారంభమవుతాయి. రెండవ టి20 డిసెంబర్ 11వ తేదీన చండీగఢ్ వేదికగా నిర్వహించనున్నారు. మూడవ వన్డే డిసెంబర్ 14వ తేదీన ధర్మశాల వేదికగా జరుగుతుంది. ఇక నాలుగో వన్డే డిసెంబర్ 17వ తేదీన లక్నో వేదికగా నిర్వహించనున్నారు. చిట్ట చివరి టీ20 డిసెంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్గా జరగనుంది.
దక్షిణాఫ్రికా తో జరిగే ఐదు టీ20 ల సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న గిల్ రావడంతో, అతడు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా జియో హాట్ స్టార్ లో ఎప్పటిలాగే రానున్నాయి. సబ్స్క్రిప్షన్ (SUBSCRIPTION) చేసుకున్న వాళ్లకు ఉచితంగా ప్రసారాలు వస్తాయి. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు తిలకించవచ్చు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, క్వింటన్ డి కాక్ (కీపర్), డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, లుంగీ ఎన్‌గిడి, అన్రిచ్ సెయింట్ నోర్ట్‌జే, అన్రిచ్ ఎస్ నోర్ట్‌జే.