E-Paper
Advertisement

Ind vs SA Super 8: నేడే ద‌క్షిణాఫ్రికాతో సూప‌ర్ మ్యాచ్‌, వ‌ర్షం గండంగా మార‌నుందా ? తెలుగోడికి అన్యాయం, టీమిండియా తుది జ‌ట్టు ఇదే !

Ind vs SA Super 8:  నేడే ద‌క్షిణాఫ్రికాతో సూప‌ర్ మ్యాచ్‌, వ‌ర్షం గండంగా మార‌నుందా ? తెలుగోడికి అన్యాయం, టీమిండియా తుది జ‌ట్టు ఇదే !
Advertisement

Ind vs SA Super 8: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య సూపర్ 8 మ్యాచ్ ( Super 8 ) జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఇండియా అలాగే దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆరున్నర గంటలకు టాస్ వేస్తారు. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వేదికలలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 మ్యాచ్ లు చూడవచ్చు.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ కు వర్షం ఎఫెక్ట్ ఉంటుందా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 లో భాగంగా ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో వర్షం ఎఫెక్ట్ ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఇవాళ అహ్మదాబాద్ లో ఎలాంటి వర్షం ప్రభావం లేదట. విపరీతమైన ఎండ కొడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంటే ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 40 ఓవర్ల మ్యాచ్ కచ్చితంగా జరుగుతుందన్నమాట.

దీంతో ఇండియన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు సూపర్ ఎనిమిదిలో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్ సెమీఫైనల్ వెళ్లడం కాస్త డౌట్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా దక్షిణాఫ్రికా తో జరగనున్న తొలి మ్యాచ్ నేపథ్యంలో తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు. అతని జట్టులోనే ఉంచుతూ స్లోగా ఆడుతున్న తరుణంలో తిలక్ వర్మపై వేటు వేసి ఎందుకు రంగం సిద్ధం చేశారట.

టీమిండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

Advertisement

India Probable XI: సూర్యకుమార్ యాదవ్ (c), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ లేదా సంజు శాంస‌న్‌, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా మరియు అర్ష్దీప్ సింగ్.

South Africa Probable XI: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.

 

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×