E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి సోదరులతో గొడవలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి సోదరులతో గొడవలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

వృషభం

Advertisement

నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. 

మిథునం

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు.  మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

Advertisement

దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.  దైవదర్శనాలు చేసుకుంటారు.

సింహం

ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

కన్య

సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

వృశ్చికం

గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. 

ధనుస్సు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.  

మకరం

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

కుంభం

ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మీనం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.  దైవ చింతన పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Tags

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×