E-Paper
Advertisement

Action Thriller OTT: క్రిమినల్స్ కి పాఠాలు చెప్పే టీచర్… మేనల్లుడి కోసం ప్రాణాల మీదకు… దద్దరిల్లే యాక్షన్

Action Thriller OTT: క్రిమినల్స్ కి పాఠాలు చెప్పే టీచర్… మేనల్లుడి కోసం ప్రాణాల మీదకు… దద్దరిల్లే యాక్షన్
Advertisement

Action Thriller OTT : 1998లో ఇండోనేషియాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. ఒక స్కూల్‌లో టీచర్‌గా చేరిన ఎడ్విన్, అక్కడ జరిగే అల్లర్ల మధ్య తన మేనల్లుడిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఓటీటీలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు అస్సలు మిస్ కాకూడని సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సీజ్ ఎట్ థోర్న్ హై’ (The Siege at Thorn High). దీనిని ప్రముఖ దర్శకుడు జోకో అన్వర్ రూపొందించారు. ఇందులో మోర్గాన్ ఓయ్, ఒమరా ఎస్టెగ్లాల్, హనా మలాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్ 17 ఏప్రిల్ 2025న మెట్రో-గోల్డ్విన్-మేయర్ ద్వారా విడుదల చేసింది. 2025 ఆగస్టు 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2025 ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది షాడో స్ట్రేస్‌’తో పాటు అత్యధిక నామినేషన్లను అందుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎడ్విన్ అనే వ్యక్తి ఒక స్కూల్‌లో టీచర్‌గా చేరతాడు. కానీ అతను అక్కడికి వచ్చింది కేవలం పాఠాలు చెప్పడానికి కాదు, తప్పిపోయిన తన మేనల్లుడిని వెతకడానికి. ఆ స్కూల్ చాలా ప్రమాదకరమైనది. అక్కడ అంతా గొడవలు చేసే కుర్రాళ్లే ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బయట నగరంలో జాతి వివక్ష వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు మొదలవుతాయి. ఆ గొడవలు స్కూల్ లోపలికి కూడా పాకుతాయి. దీంతో స్కూల్ ఒక యుద్ధభూమిలా మారిపోతుంది. బయట జరుగుతున్న హింసను చూసి స్కూల్‌లోని విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడతారు.

ఆ గందరగోళంలో ఎడ్విన్ తన మేనల్లుడిని కాపాడుకుంటూ, తను కూడా ప్రాణాలతో బయటపడటానికి పోరాడాల్సి వస్తుంది. చివరికి ఎడ్విన్ తన మేనల్లుడిని కావాడుకున్నాడా ? అసలు చిన్నప్పుడే అతను ఎలా తప్పిపోయాడు ? ఎడ్విన్ గతం ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×