IND VS PAK Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ ఫైనల్ పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో కచ్చితంగా టీమిండియా విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో రెండు విజయాలను పాకిస్తాన్ పై నమోదు చేసుకుని టీమిండియా. ఇవాళ ఫైనల్లో కూడా విజయం సాధించి ఛాంపియన్గా నిలుస్తుందని అందరూ అంటున్నారు. ఇండియా విజయం సాధించడం ఖాయం కావడంతో… ట్రోఫీ అందుకునే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుందట. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( MOHSIN NAQVI ) చేతుల మీదుగా.. ఈ టోర్నమెంట్ తీసుకోకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని అందరూ అంటున్నారు. అయితే టీమిండియా విజయం సాధిస్తే కచ్చితంగా… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదికగా సూర్యకుమార్ ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. అంటే పాకిస్తాన్ వ్యక్తి ట్రోఫీ ఇస్తే టీమిండియా తీసుకోవాలి. అయితే ఇలా తీసుకుంటే దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి( Board of Control for Cricket in India ) కీలక నిర్ణయం తీసుకుందట. సూర్యకుమార్ యాదవ్ ఆ ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయం.. తీసుకొని కీలక ఆదేశాలు ఇచ్చిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ ట్రోఫీని సూర్యకుమార్ స్థానంలో టీమిండియా బౌలింగ్ కోచ్ అయిన మోర్ని మోర్కెల్ అందుకుంటాడని సమాచారం అందుతోంది. మోర్నీ మోర్కెల్ ( Morne Morkel ) విదేశీయుడు కాబట్టి అతడు తీసుకుంటే ఎలాంటి విమర్శలు రావని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యలో… టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ కు హర్ధిక్ పాండ్యా దూరం కాబోతున్నాడట. శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యాకు గాయం అయింది. దీంతో అతను ఆ మ్యాచ్ లో ఒకే ఒక్క ఓవర్ వేశాడు. ఇవాళ్టి ఫైనల్ మ్యాచ్ లో హర్ధిక్ పాండ్యా ఆడే అవకాశాలు కష్టమేనని అంటున్నారు. హర్ధిక్ పాండ్యా ఆడకపోతే… అతని స్థానంలో… జితేష్ శర్మ జట్టులోకి వచ్చే ఛాన్సులు కన్పిస్తున్నాయి. లేకపోతే రింకూ సింగ్ వస్తాడని అంటున్నారు.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
🚨INDIA UNLIKELY TO TAKE ASIA CUP TROPHY FROM MOHSIN NAQVI.
Chairman of PCB and acc president Mohsin Naqvi has officially announced that he will hand over the trophy to winning team. India is 99% likely to win, but India will not take the trophy from Mohsin Naqvi.
So, the best… pic.twitter.com/l9dALnbkd3— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 27, 2025