Abhishek- Gambhir: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా ప్రస్తుతం టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో అన్ని మ్యాచ్ లు విజయం సాధించిన టీమిండియా… ఫైనల్స్ కు చేరింది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంకతో మ్యాచ్ కు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మకు ( Abhishek Sharma) టీమిండియా కోచ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. బౌలర్లపై విరుచుపడటం ఒక్కటే కాదు.. కాస్త బంతులు చూసుకుంటూ ఆడాలని గంభీర్ (Gautam Gambhir ) ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా విజయాలకు మూల కారణం డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) . ఈ టోర్నమెంట్ లో 200 లకు పైగా స్ట్రైక్ రేట్ తో దుమ్ములేపుతున్నాడు. ఓ మాత్రం తగ్గడం లేదు డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ టోర్నమెంట్ లో 300 లకు పైగా స్కోర్ కూడా చేశాడు. అయితే.. అలాంటి అభిషేక్ శర్మను తిడుతూ రెచ్చిపోయారు గంభీర్. దూకుడుగా ఎందుకు ఆడుతున్నావ్… ? ఇన్నింగ్స్ చివరి వరకు నువ్వు ఉండాలని…. అభిషేక్ శర్మపై సీరియస్ అయ్యారు. ఇలా ఆడితే… కుదరదని హెచ్చరించారట. షాట్స్ ఆడేటప్పుడు కాలిపై వేయిట్ వేయకంటూ సలహాలు కూడా ఇచ్చాడు గంభీర్. బంతులు కాస్త చూసుకుంటూ.. స్ట్రైక్ రేట్ కాపాడుకుంటూ ఆడాలని సూచనలు ఇచ్చాడు. ఇక గంభీర్ ఇచ్చిన వార్నింగ్ కు డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎలాంటి రియాక్షన్ లేదట. మీరు చెప్పినట్లే ఆడాతానని వెల్లడించాడట. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ కు వెళ్లిన టీమిండియా…ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రీలంక తో ఆడుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ తరుణంలోనే.. టీమిండియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. మరో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు టీమిండియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇందులో 8 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే… సిక్సుకు ప్రయత్నం చేసిన అభిషేక్.. ఔట్ అయ్యాడు.
ఈ మ్యాచ్ లో 22 బంతుల్లోనే 50 పరుగులు చేసుకున్నాడు. దీంతో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. అంతేకాదు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో 300 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
Gambhir was angry on Abhishek sharma.
— Vipin Tiwari (@Vipintiwari952) September 26, 2025