Delhi Crime News: తనను తాను దేవుడిగా చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్టు అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలోని ఓ హోటల్‌లో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను ఢిల్లీకి తరలించారు.
ఆధ్యాత్మిక నాయకుడు, దేవుడిగా చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆగ్రాలోని ఒక హోటల్‌లో ఆయన్ని అరెస్టు చేశారు. ఢిల్లీలోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రీసెర్చ్ డైరెక్టర్‌గా పని చేశారు.
కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఎస్ఆర్ఐ ఎస్ఐఐఎంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు ఆయన. బలహీన వర్గాలకు చెందిన స్కాలర్‌షిప్ కింద ఈ సంస్థలో చదువుతున్న 17 మందికి పైగా మహిళా విద్యార్థులను టార్గెట్ చేశారు. వారిని దుర్భాష, అవాంఛిత శారీరక సంబంధం, అశ్లీల సందేశాలు పంపినట్టు ఆయనపై ప్రధాన ఆరోపణలు.
ఒడిషాలో జన్మించిన స్వామి చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో ఈనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అప్పటి నుంచి చైతన్యానందను పరారీలో ఉన్నారు. చివరకు ఆదివారం ఉదయం చిక్కారు.
ALSO READ: భర్త కజిన్ సిస్టర్‌తో భార్య సీక్రెట్ రొమాన్స్.. షాకైన భర్త
తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రీ శృంగేరి మఠంలో డైరెక్టర్ పదవి నుండి స్వామి చైతన్యానంద సరస్వతిని తొలగించింది. అతడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుక్-అవుట్ నోటీసు జారీ చేశారు.
62ఏళ్ల స్వామి చైతన్యానంద సరస్వతి గురించి సమాచారం వచ్చిన తర్వాత అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. మహిళా విద్యార్థులను రాత్రిపూట తన క్వార్టర్లకు బలవంతంగా పిలిపించేవారని ఆరోపించారు. అదే సమయంలో వారికి టెక్స్ట్ సందేశాలు పంపేవాడని ప్రధాన ఆరోపన. తన ఫోన్ ద్వారా విద్యార్థుల కదలికలను కూడా పర్యవేక్షించాడనే ఆరోపణలు లేకపోలేదు.
శ్రీ శృంగేరి మఠం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. నిధుల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత, పార్థసారథి ట్రస్ట్ డబ్బుతో పరారీ అయ్యాడు. బ్యాంకు నుండి దాదాపు రూ. 55 లక్షలు విత్‌డ్రా చేశాడని తెలుస్తోంది. వేరే పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
హోలీ వేడుకల సమయంలో విద్యార్థులను వరుసలో నిలబెట్టి తొలి తనకు రంగు వేయమని బలవంతం చేశారని విద్యార్థినులు ఆరోపించారు. 2025 జూన్‌లో రిషికేశ్ టూర్ నుంచి వేధింపులు పెరిగాయని, రాత్రిపూట లైంగిక వేధింపులకు గురి చేసినట్టు అనేక మంది ఆరోపించారట. పోలీసులు 32 మంది విద్యార్థుల నుండి వాంగ్మూలాలను నమోదు చేశారు.
చైతన్యానంద సరస్వతి అరెస్ట్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధిని అరెస్టు చేసిన పోలీసులు
కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో… https://t.co/3vMsRuHlaF pic.twitter.com/t0XEiCoaWG
— BIG TV Breaking News (@bigtvtelugu) September 28, 2025