E-Paper
Advertisement

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!
Advertisement

Bigg Boss 9:సంజన గల్రానీ (Sanjana Garlani)… ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో మెయిన్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న ఈమె కంటెస్టెంట్స్ చేత ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ఈమెకు ఇప్పుడు భారీ షాక్ ఇస్తూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో సంజనపై ఎన్నో కేసులు నమోదైన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. 2020 కరోనా సమయంలో డ్రగ్స్ వ్యవహారం కర్ణాటకలో కలకలం సృష్టించింది. ఆ సమయంలో సినీనటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2 నెలల తర్వాత బెయిల్ లభించడంతో జైలు జీవితం గడిపిన ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. ముఖ్యంగా సంజనపై కొకైన్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి వంటి మత్తు పదార్థాల వినియోగంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంజన..

అలా ఈమె పై ఏకంగా 3 కేసులు నమోదు అయ్యాయి. 2024 మార్చ్ 25న కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలవల్ల రద్దు చేసింది. అప్పటి కోర్టు అభిప్రాయం ప్రకారం సెక్షన్ 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలోనే మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్ లో జరపలేమని కూడా తెలిపింది. దీంతో సంజనకు కాస్త ఉపశమనం లభించింది. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు ఇప్పుడు సంజనకి నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. అంతేకాదు ఈ కేసు గురించి పూర్తి వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులలో వెల్లడించింది.

Advertisement

సంజన కి సుప్రీంకోర్టు నోటీసులు..

ఇకపోతే మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి ఈమె మత్తు పదార్థాలు కొనుగోలు చేసిందనే ఆధారాలు కూడా ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. ఆర్థిక లాభాల కోసం ఇలా పార్టీల సమయంలో వివిధ వ్యక్తులకు ఆమె మత్తు పదార్థాలు విక్రయించిందని సుప్రీంకోర్టుకు ఆధారాలు కూడా సమర్పించారు. ముఖ్యంగా విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనను గతంలోనే బెంగళూరు పోలీసుల కోరినా.. ఆమె నోరు విప్పలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా ఉన్న ఈమెకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హౌస్ నుండి సంజనాన్ని పంపించేస్తారా?

ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో పలువురు నెటిజన్లు కూడా ఎలాగో సీక్రెట్ రూమ్ లో ఉంది కదా అటు నుంచి అటే బయటికి పంపించేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంజనను అప్పుడే ఎలా బయటకు పంపించేస్తారు? నోటీసులు ఇచ్చిన కొంతకాలం గడువు ఉంటుంది కదా.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి ఇలాంటి సమయంలో దిక్కుతోచని స్థితిలో సంజన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×