E-Paper
Advertisement

Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా…జట్లు ఇవే

Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా…జట్లు ఇవే
Advertisement

Ind vs NZ: టీమిండియా ( Team India) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand )జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్.. నిన్ననే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ బెంగళూరులో ( Benguluru) భారీ వర్షం కారణంగా మొదటి రోజు ఆటను రద్దు చేశారు. అయితే.. ఆట ప్రారంభం కానుంది. రెండవ రోజున బెంగళూరులో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియను ముగించేశారు అంపైర్లు.

India vs New Zealand 1st Test Toss Win By Rohit sharma

అయితే ఇందులో రోహిత్ శర్మ టాస్ నెగ్గడం జరిగింది. దీంతో రోహిత్ శర్మ ( Rohit sharma)… బ్యాటింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. 9:30 గంటల ప్రాంతంలో టీమిండియా బ్యాటింగ్ కూడా దిగనుంది. టాస్ ఓడిన న్యూజిలాండ్ జట్టు ( New Zealand ) ఇక బౌలింగ్ చేయనుంది. నిన్నటి నుంచి బెంగళూరులో వర్షం.. బీభత్సం సృష్టించగా.. ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఫ్యాన్స్.. ఉత్సాహపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే టీమిండియా ( Team India) కూడా మొదట బ్యాటింగ్ చేయనుంది.

Advertisement

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

అయితే బ్యాటింగ్ కు దిగిన తర్వాత బెంగళూరులో మళ్లీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత అందరిలోనూ ఉంది. ఏది ఏమైనా.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ( Rohit sharma) బ్యాటింగ్ తీసుకోవడం మంచిదే అని చెబుతున్నారు. అలాగే తుది జట్టులో సర్పరాజు ఖాన్ బరిలోకి దిగుతున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ పైన మూడు టెస్టులు విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పైన టీమిండియా పట్టు సాధిస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఆస్ట్రేలియా తో టీమిండియా.. అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి న్యూజిలాండ్ పైన తొందరగా మ్యాచ్లు వరుసగా గెలిచి… ఆస్ట్రేలియా పైన పోరాడవచ్చు. కానీ న్యూజిలాండ్ పైనే ఓడిపోతే ఆస్ట్రేలియా పైన గెలవడం చాలా కష్టం అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఆడనుందని సమాచారం.

Also Read: Sania Mirza: మరో పాకిస్థాన్‌ వ్యక్తితో సానియా మీర్జా రెండో పెళ్లి ?

ఇరు జట్లు:

న్యూజిలాండ్ ( New Zealand ) (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

భారత్ ( Team India) (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×