BigTV English

IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

IND vs NZ 2024 Test Series: బంగ్లాదేశ్‌ జట్టును టెస్ట్‌ లు, టీ 20ల్లో చిత్తు చేసిన టీమిండియా మరో సమరానికి రెడీ అవుతోంది. న్యూజిలాండ్‌ జట్టుతో…. టీమిండియా ( India) మరో సవాల్ కు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ తో (New Zealand) సిరీస్ లో తలబడుతోంది. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే అందరి చూపు పడనుంది. వన్డే టెస్టులకు మాత్రమే పరిమితమైన సీనియర్లు కివిస్ పైన ఎలా చిలరేగి ఆడుతారనేది ఆసక్తికరంగా మారుతుంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గొప్పగా ఏమీ రాణించలేకపోయారు. అంచనాలకు తగినట్లుగా పరుగులు చేయలేదు. దీంతో స్టార్స్ నుంచి అంచనాలకు తగినట్టుగా ఆట లేకపోవడంతో అభిమానులు కాస్త డీల పడిపోయారు.


అయితే న్యూజిలాండ్ తో సిరీస్ లో మాత్రం రోహిత్, విరాట్ ఇద్దరూ బ్యాట్ కు పని చెబితే పరుగుల విందు ఖాయమేనంటున్నారు. బంగ్లాదేశ్ తో (Bangladesh) తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ 11 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేశాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పైన రోహిత్ శర్మకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. కివీస్ పైన ఇప్పటివరకు ఆరు టెస్టులతో బరిలోకి దిగాడు. 11 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశారు. 424 పరుగులు సాధించాడు.

యావరేజ్ 53. న్యూజిలాండ్ పై (New Zealand) రోహిత్ శర్మ నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. న్యూజిలాండ్ లో మాత్రం రెండు మ్యాచ్ లలో 122 పరుగులు సాధించాడు. ఇందులో హఫ్ సెంచరీ ఉంది. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ 23 పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దూకుడు మీద కనిపించారు. కానీ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ పై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 11 మ్యాచ్ లలో బరిలోకి దిగాడు. 21 ఇన్నింగ్స్ ఆడాడు. 866 పరుగులు సాధించాడు.


Also Read: IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

యావరేజ్ 45.57. మూడు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ తో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ నాలుగు సార్లు బరిలోకి దిగారు. 252 పరుగులు సాధించాడు. యావరేజ్ 36. న్యూజిలాండ్ గడ్డపైన కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. గత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ కోహ్లీ, రోహిత్ రాణించడం టీమిండియాకు ఎంతో అవసరం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు టాప్ ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ ను మరింత పదిలం చేసుకోవాలంటే న్యూజిలాండ్ పై చెలరేగి ఆడాలి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ లు హాట్‌ స్టార్‌ లో రావు. కేవలం స్పోర్ట్స్‌ 18 శాటిలైట్‌ ఛానెల్‌ లో వస్తాయి. లేకపోతే.. జియో సినిమాలో యాప్‌ లో ఉచితంగానే చూడవచ్చును.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×