BigTV English

Chandhoo Mondeti : సైలెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కు ప్లానింగ్ జరుగుతుంది

Chandhoo Mondeti : సైలెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కు ప్లానింగ్ జరుగుతుంది

Chandhoo Mondeti: కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు చందు మొండేటి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడం మాత్రమే కాకుండా చాలామంది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ ను తెలుగులో కూడా ప్రేమమ్ పేరుతో రీమేక్ చేశాడ. నాగచైతన్య నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సవ్యసాచి సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.


ప్రతి దర్శకుడికి కూడా తమ కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటూ ఉంటుంది. అలా చందు విషయానికి వస్తే నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ 2 సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చందు ని పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసేసింది. మరోవైపు నిఖిల్ ని కూడా పాన్ ఇండియా హీరో ను చేసింది. దాదాపు 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ప్రస్తుతం చందు పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం చందు నాగచైతన్యతో తండెల్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

తండేల్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య కి జంటగా సాయి పల్లవి నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇదివరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీరిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటుందని చాలా కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే తండేలు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర మాండలికంలో నాగచైతన్య మాట్లాడబోతున్నాడు.


కొంతమంది దర్శకులు మొదటి సినిమా తర్వాత బాలీవుడ్ లో డెబ్యూ డైరెక్టర్ గా కూడా ప్రయత్నం మొదలుపెట్టారు. వారిలో రాంగోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ మినహాయిస్తే మిగతా డైరెక్టర్లు అంతగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా తర్వాత దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.తండేల్ సినిమా కథాంశానికి వస్తే పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉండి భారత్ కు తిరిగి వచ్చిన రాజు అని ఒక వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×