BigTV English

Rohit Sharma Mobile: కోట్లు సంపాదిస్తున్న చీప్ ఫోన్ వాడుతున్న రోహిత్.. ధర ఎంతంటే ?

Rohit Sharma Mobile: కోట్లు సంపాదిస్తున్న చీప్ ఫోన్ వాడుతున్న రోహిత్.. ధర ఎంతంటే ?

Rohit Sharma Mobile: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలో టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ… ఏజ్ పైబడినప్పటికీ… దుమ్ము లేపుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చిన రోహిత్…. మొన్నటి ఇంగ్లాండు వన్డేలో… సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ (Rohit Sharma  ). అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత తన భార్య… రితిక కు ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటోలు వైరల్ అయ్యాయి.


Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 నుంచి దూరం కానున్న 5 గురు ప్లేయర్లు వీళ్లే ?

ఈ సందర్భంగా… తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా మాట్లాడారు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ ఫోన్ మాట్లాడిన ఫోటోలు వైరల్ కావడంతో… అతను వాడే ఫోన్ పైన కొత్త చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ( Rohit Sharma Mobile) ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో… అతను వాడే ఫోన్ వన్ ప్లస్ 12 అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టులు కూడా పెడుతున్నారు నేటిజన్స్. అంతేకాదు… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాడే ఫోను ధర కూడా.. ఈ సందర్భంగా చెప్పేస్తున్నారు.


రోహిత్ శర్మ వాడే ఫోన్ ధర 58 వేల రూపాయల నుంచి… 61 వేల రూపాయలుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు కోట్లలో సంపాదించే రోహిత్ శర్మ ఐఫోన్ వాడకుండా .. వన్ ప్లస్ ఫోన్ వాడటం ఏంటని… కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక రోహిత్ శర్మ ఫ్యాన్స్… మరో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఎంత సంపాదించిన… డబ్బులు మాత్రం తక్కువగా ఖర్చు పెట్టి కుటుంబం కోసం డిపాజిట్ చేస్తాడని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో 119 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. కేవలం 90 బంతుల్లో ఆ స్కోర్ చేయగలిగాడు. ఇందులో 12 బౌండరీలు అలాగే ఏడు సిక్సర్లు ఉన్నాయి. 132.22 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు రోహిత్ శర్మ. అయితే చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు… ఫామ్ లో లేని రోహిత్ శర్మ సెంచరీ చేయడం… టీమిండియా కు కచ్చితంగా కలిసి వచ్చే అంశం. గత ఏడాదికాలంగా రోహిత్ శర్మ పూర్ ఫామ్ తో… అందరికీ చికాకు తెప్పించాడు. కానీ ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తే టీమ్ ఇండియాకు తిరుగు లేదని అంటున్నారు. మరి మూడవ వన్డే లోనైనా రోహిత్ శర్మ గాడిలో పడతాడో లేదో చూడాలి.

Also Read: Ajinkya Rahane: రహానే భారీ సెంచరీ.. టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఖాయం ?

 

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×