యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా ఓ కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు వదలడం లేదు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏకంగా పార్లమెంట్ లోనూ అతడి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రణవీర్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఆయన వ్యాఖ్యలపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా రణవీర్ నాలుక కోసిన వారికి ఏకంగా రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ ప్రకటించారు సైఫ్ అలీ ఖాన్ అభిమాని, సోషల్ మీడియా ఇన్ ఫ్లైయెన్సర్ ఫైజాన్ అన్సారీ.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా ఇటీవల ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ప్రముఖులు సీరియస్ అయ్యారు. ఆయన మాటలను తీవ్రంగా ఖండించారు. అయితే.. సైఫ్ అలీ ఖాన్ అభిమాని, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఫైజాన్ అన్సారీ సైతం ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యాడు. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ ను హాస్పిటల్ లో చేర్చిన ఆటో డ్రైవర్ కు రూ.. 11, 000 బహుమతిగా ఇచ్చి, పైజాన్ పాపులర్ అయ్యాడు. తాజాగా రణవీర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. “యూట్యూబర్ రణవీర్ అలహాబాడియా అసహ్యకరమైన మాటలు మాట్లాడాడు. నేను అక్కడ ఉంటే.. అతడి నాలుక కోసేవాడిని. ఆ మాటలు వింటే నాకు సిగ్గు అనిపించింది. కోపం తెప్పించింది. ఎవరైనా రణవీర్ అలహాబాడియా నాలుక కోస్తే, నేను వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తాను” అని ఆఫర్ ఇచ్చాడు.
Read Also: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?
రణవీర్ అల్లాబాడియా చేసిన కామెంట్స్ ఏంటంటే?
తాజాగా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే ఎపిసోడ్ లో సమయ్ రైనా, ఆశిష్ చంచలానీ, అపూర్వ ముఖిజాతో పాటు రణవీర్ జడ్జిగా కనిపించాడు. ఈ సందర్భంగా ఓ లేడీ కంటెస్టెంట్ తో “ మీ తల్లిదండ్రులు సె.. చేయడం చూశావా?” అని అడిగాడు. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ విని అందరూ షాక్ అయ్యారు. కానీ, ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు రావడంతో రణవీర్ అల్లాబాడియా క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తాను అనుకోకుండా పొరపాటుగా మాట్లాడానని చెప్పాడు. తన వ్యాఖ్యలు ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు. అయినప్పటికీ చాలా మంది అతడిపై కేసులు పెడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. వివరణ ఇవ్వాలంటూ సమాచార, మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అటు రణవీర్ అల్లాబాడియాకు చెందిన వివాదాస్పద వీడియోను వెంనటే యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో సదరు సంస్థ ఆయన వీడియోను డిలీట్ చేసింది.
Read Also: భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..