BigTV English

Ranveer Allahbadia controversy : మీ పేరెంట్స్‌తో సె* చేస్తావా? లేదా చూస్తావా? ఈ చెత్త ప్రశ్నతో చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్హాబాడియా ఎవరు?

Ranveer Allahbadia controversy : మీ పేరెంట్స్‌తో సె* చేస్తావా? లేదా చూస్తావా? ఈ చెత్త ప్రశ్నతో చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్హాబాడియా ఎవరు?

Ranveer Allahbadia controversy : మాట్లాడేటప్పుడు నోటికి కాదు బుద్ధికి పని చెప్పాలని అంటుంటారు పెద్దలు. కాదని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రముఖ యూట్యూబర్, పోడ్ కాస్టర్.. రణ్ ధీర్ అల్హాబాడియాను చూస్తే అర్థం అవుతుంది. దేశ వ్యాప్తంగా పేరున్న యూట్యూబ్ షో.. మిలియన్స్ లో వ్యూయర్స్ ఉన్నారు. తాను మాట్లాడేది.. కోట్ల మంది వింటారన్న సంగతి తెలుసు, ఏదైనా చిన్నపాటి తప్పులు చేసిన ఇప్పటి ఇంటర్నెట్ ప్రపంచంలో తప్పించుకోవడం వీలు కాదని తెలుసు.. అయినా, కామెడీ పేరుతో అత్యంత నీచమైన మాటలు మాట్లాడేశాడు. అడ్డు అదుపు లేకుండా.. ఆ సమయానికి అన్నీ నోరుజారేశాడు. తల్లీ, తండ్రి అనే సృహ.. కుటుంబం అనే వ్యవస్థ.. సమాజం చూస్తుందనే భయం లేకుండా అనాగరికుడిలా మాట్లాడాడు. ఇంకే ముందు.. ఇప్పుడు ఈ యూట్యూబర్ పై దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.


ఇంతకీ ఏం జరిగింది.
అల్హాబాడియా యూట్యూబ్ లో సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియా గాట్ ల్యాటెంట్ (India’s Got Latent) అనే కామెడీ షోలో పాల్గొన్నాడు. ఇందులో.. వివిధ రంగాల వారిని తీసుకొచ్చి, వారిని ప్రశ్నలు అడుగుతుంటారు. అలా.. ఓ అమ్మాయి ఈ షోలో పాల్గొనగా… అల్హాబాడియా ఆమెను చాలా నీచమైన ప్రశ్నలు అడిగాడు. సభ్యసమాజంలో బయటకు చెప్పుకోలేని, వినలేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. పైగా.. తాను అడిగి ప్రశ్నలకు తానే నవ్వుకుంటూ.. దాన్ని కామెడీగా చెప్పుకొచ్చాడు.

మీ తల్లిదండ్రులు ఏకాంతంగా కలిసున్నప్పుడు వాళ్లను చూస్తావా.. లేదా నువ్వూ వారితో కలిసిపోతావా.. అంటూ ఘోరమైన తీరుగా ప్రశ్నించాడు. అక్కడితో ఆగిపోకుండా.. ఏకాంతానికి సంబంధించిన అనేక ప్రశ్నలు.. జుగ్గస్సాకర రీతిలో అడిగాడు. ఈ ఎపిసోడ్ చూసిన అందరూ.. అల్హాబాడియాను తీవ్రంగా విమర్శిస్తున్నారు.


ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ లో షూట్ కాగా, రీసెంట్ గానే విడుదల అయ్యింది. ఇందులో రణ్ ధీర్ అడిగిన ప్రశ్నలకు నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. అతడికి బుద్ధి నశించిందని, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ప్రభుత్వం సైతం స్పందించింది.

కేంద్రం సీరియస్ – సమన్లు జారీ
కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అతను చేసిన కామెంట్లపై సమన్లు పంపేందుకు సిద్ధమవుతోంది. క్రమంగా రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదో కోవలే హాస్యం పేరుతో అసభ్యకరంగా మాట్లాడే వారికి నోటీసులు ఇవ్వాలంటూ ఉద్ధవ్ ఠాక్రే శివసేనా డిమాండ్ చేసింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూట్యూబ్ ఈ ఎపిసోడ్ ను తొలగించింది. అతని వీడియోను అందుబాటులో లేకుండా చేసింది. కానీ.. ఇప్పటికే.. అనేక మంది డౌన్ లోడ్ చేసిన ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్హాబాడియా తీరుపై తీవ్ర అగ్రహావేశాలకు కారణమవుతోంది.

ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్.. అల్హాబాడియాపై సమన్లు జారి చేసింది. అతనితో పాటు షోలో పాల్గొన్న సమయ్ రైనా ఇతరులు.. అసభ్యకర వ్యాఖ్యలపై తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 17న సమన్లు పొందిన వారంతా విచారణకు హాజరుకావాలని వెల్లడించింది.

అల్లాబాడియా స్పందన

వివాదం పెద్దది అవుతుండడంతో ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసాడు. అందులో.. తన వ్యాఖ్యలు అసందర్భంగా ఉండడమే కాదు, హాస్యంగా కూడా లేవి అంగీకరించాడు. తన వ్యాఖ్యాలకు క్షమాపణలు చెప్పాడు. అయితే.. ఇతనికి ఇదేం కొత్త వివాదం కాదు అంటున్నారు నెటిజన్లు.. గతంలోనూ అనేక వివాదాస్పద కంటెట్ తో వార్తల్లో నిలిచాడు. అసభ్యకర కామెంట్లు, ప్రశ్నలతో చివాట్లు తిన్నాడు. అయినా.. మారకుండా.. కామెడీ పేరుతో మరో చెత్త ప్రశ్నలు, వెకిలి నవ్వులతో అందరి ముందు దోషిగా నిలబడ్డాడు.

దేశవ్యాప్తంగా పోలీసు కేసులు

ఇక ఈ విషయంపై కేంద్రంలోని పెద్దలు, మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ విలువలకు మర్యాద లేకుండా ఇష్టారాజ్యంగా కామెంట్ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే.. ఆ కంటెంట్ ను తొలగించగా, తదుపరి చర్యలకు ఆదేశించింది. మరోవైపు.. దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, మణిపూర్ సహా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆయా కేసుల విషయమై ఇప్పటికే.. మహారాష్ట్ర పోలీసులు రణ్ ధీర్ అల్హాబాడియా ఇంటికి వెళ్లి కేసు విచారణకు హాజరుకావాలని నోటీసులు అంటించి వచ్చారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. కాగా.. రోజురోజుకు తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్న ఈ వ్యాఖ్యలకు అల్హాబాడియా ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో వేచి చూడాలి.

Also Read : మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×