Ajinkya Rahane: తిరిగి టీమ్ ఇండియాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే. దేశవాళి క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చేసి.. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటానని ఇప్పటికే పలుమార్లు తెలిపాడు రహానే. ప్రస్తుతం తనదృష్టి అంతా భారత జట్టులో చోటు సంపాదించడం పైనే నిలిచిందన్నాడు. రంజీ ట్రోఫీలో మెరుగైన ఆట కనబరచడం ద్వారా తిరిగి భారత జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని ఇప్పటికే తెలిపిన అజింక్య రహనే.. తాజాగా సూపర్ సెంచరీ తో మెరిశాడు.
Also Read: Virender Sehwag: సెహ్వాగ్ కాపురంలో చిచ్చుపెట్టిన కారు.. విడాకులకు ఇదే కారణం ?
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో ముంబై కెప్టెన్ రహనే క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఈ సెంచరీని నమోదు చేశాడు. 160 బంతులలో 12 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 200 మ్యాచ్ ఆడుతున్న రహానేకి ఇది 41 వ సెంచరీ. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన రహానే.. సెంచరీ తర్వాత కాసేపు క్రీజ్ లో నిలిచి 108 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఈ సెంచరీ తో తన బ్యాట్ పవర్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు రహానే. ఈ సీనియర్ బ్యాటర్ ప్రత్యర్థి బౌలర్లను బాధిపారేశాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో రహనేని తిరిగి మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు క్రీడాభిమానులు.
సూర్య కుమార్ యాదవ్ తో కలిసి నాలుగవ వికెట్ కి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. ముంబై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ 86 బంతులలో 70 పరుగులు చేశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో 58 బంతులలో ఆరు ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు రహానే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 315 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
తనుష్ కోటియాన్ {97}, షమ్స్ ములాని {91} అత్యధిక పరుగులతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్యానా 301 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక హర్యానా బ్యాటర్లలో అంకిత్ కుమార్ 136 పరుగులతో రాణించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ముంబైకి 14 పరుగుల ఆదిక్యం లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో ముంబై జట్టు 339 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
Also Read: Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?
ముంబై బ్యాటింగ్ లో రహానే 108, సూర్య కుమార్ యాదవ్ 70, శివమ్ దూబే 48, లాడ్ 43 పరుగులతో రాణించారు. దీంతో ముంబై 353 పరుగుల ఆదిక్యంలో నిలిచింది. అనంతరం రెండవ ప్రారంభించిన హర్యానా జట్టు 24 పరుగుల వద్ద తన తొలి వికెట్ అంకిత్ కుమార్ {11} ని కోల్పోయింది. ప్రస్తుతం హర్యానా జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. దలాల్ {17*}, యష్ వర్ధన్ దలాల్ {1*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
🚨 CAPTAIN AJINKYA RAHANE SMASHED A RANJI TROPHY HUNDRED IN THE QUARTERS. 🚨 pic.twitter.com/PdR8Gv0hHN
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2025