E-Paper
Advertisement

Himanta Biswa Sarma: సానియా మీర్జా, ఆమె కొడుకు భార‌త పౌర‌స‌త్వం ర‌ద్దు చేస్తాం!

Himanta Biswa Sarma: సానియా మీర్జా, ఆమె కొడుకు భార‌త పౌర‌స‌త్వం ర‌ద్దు చేస్తాం!
Advertisement

Himanta Biswa Sarma: ఇండియ‌న్ మాజీ టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా ( Sania Mirza ) అలాగే ఆమె కొడుకుకు ఊహించని షాక్ తగిలింది. సానియా మీర్జా, ఆమె కొడుకు భారత పౌరసత్వం రద్దు ( Indian citizenship ) చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma). పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సానియా మీర్జాతో పాటు ఆమె కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ ( Izhaan Mirza Malik) భారత పౌరసత్వం రద్దు చేయాలని.. వాళ్ళిద్దరూ ఈ దేశస్తులు కాదంటూ బాంబు పేల్చారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

సానియా మీర్జా, ఆమె కొడుకు భార‌త పౌర‌స‌త్వం ర‌ద్దు చేస్తాం!

Advertisement

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma) ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ కు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ రెచ్చిపోతూ ఉంటారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూనే కాంగ్రెస్ నేతలకు, పాకిస్తాన్ కు సంబంధం పెడుతూ ఉంటారు. అయితే అలాంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తాజాగా సానియా మీర్జా ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేశాడు. సానియా మీర్జా ఫ్యామిలీకి ఇచ్చిన ఇండియ‌న్ సిటిజెన్ షిప్ ర‌ద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన షోయ‌బ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా అలాగే ఆమె కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ కు ఇండియన్ పౌరసత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. వెంటనే సానియా మీర్జా ఫ్యామిలీకి ఇచ్చిన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లకు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సానియా మీర్జా ఫ్యామిలీకి భారత పౌరసత్వం ఇవ్వవచ్చా ?

భారత చట్టాల ప్రకారం సానియా మీర్జా ఫ్యామిలీకి పౌరసత్వం ఇవ్వవచ్చని తెలుస్తోంది. సానియా మీర్జా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. కాబట్టి ఆమెకు ఇప్పటికే పౌరసత్వం వచ్చింది. అలాగే సానియా మీర్జా కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ ( Izhaan Mirza Malik) హైదరాబాద్ లోనే జన్మించాడు. ఆయన తల్లి భారత పౌరురాలు అయిన నేపథ్యంలో.. రూల్స్ ప్రకారం ఆమె కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ కు కూడా ఇండియన్ పౌర‌స‌త్వం వచ్చింది. దానికి తోడు షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంది సానియా మీర్జా. దీంతో సానియా మీర్జా ఫ్యామిలీకి భారత పౌరసత్వం విషయంలో ఎలాంటి అడ్డంకులు రాలేదు.

Advertisement

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×